తాజా ఆకు కూరలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి అన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆకుకూరలను తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మరి ఎన్నో పోషక విలువలు కలిగిన తోటకూర వేపుడు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*తాజా తోటకూర రెండు కట్టలు
*ఉల్లిపాయ ముక్కలు
*వెల్లుల్లి రెబ్బలు పది
*కారం టేబుల్ స్పూన్
*పసుపు చిటికెడు
*కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్లు
*పప్పుల పొడి రెండు టేబుల్ స్పూన్లు
*నూనె తగినంత
*శనగపప్పు 1 స్పూన్
*మినప్పప్పు 1 స్పూన్
*ఉప్పు తగినంత
*కొద్దిగా నీరు
ముందుగా తోటకూరను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ మీద కడాయి ఉంచి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. ఇది కొద్దిగా ఎరుపు రంగులోకి రాగానే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు ఎర్రపడ్డాక అందులోకి ముందుగా తరిగిపెట్టుకున్న తోట కూర వేసి బాగా కలియబెట్టాలి. కాసేపు మూత పెట్టి ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత ఒక గ్లాస్ నీటిని వేసి తగినంత ఉప్పు వేసి మరోమారు కలియబెట్టి మూత పెట్టాలి. ఇలా చేయటంవల్ల ఆకు తొందరగా మెత్తబడుతుంది.ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలియబెట్టి చిటికెడు పసుపు వేసి ఉడికించాలి.నీరు మొత్తం ఇంకిపోయిన తరువాత కారం వేసి సిమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు వేయించాలి.కారం బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి, పప్పుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన తోటకూర వేపుడు తయారైనట్లే. ఈ తోటకూర వేపుడు చపాతీ పూరీ వంటివాటిలో తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…