కష్టపడి నిజాయితీగా పనిచేయాలే గానీ ఏ పని అయినా చేయవచ్చు. అందులో మొహమాట పడాల్సిన పనిలేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే అదే. నిజాయితీగా ఉంటే ఏ పనైనా చేయవచ్చు. అందులో సిగ్గు పడాల్సిన అవసరం లేదు. అవును.. ఆ వ్యక్తి కూడా సరిగ్గా అలాగే భావించాడు. అందుకని గతంలో తాను ఫొటోగ్రాఫర్‌గా జీవితం గడిపినా.. ఇప్పుడు అవమానం అని భావించకుండా రోడ్డు పక్కన షూ పాలిష్‌లు చేస్తూ నెలకు ఏకంగా రూ.18 లక్షలు సంపాదిస్తున్నాడు. అతనే అమెరికాకు చెందిన డాన్ వార్డ్.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న మాన్‌హట్టన్ అనే ఏరియాలో డాన్ వార్డ్ బాగా పాపులర్. అతని వద్ద షూ పాలిష్ చేయించుకునేందుకు ఎంతో మంది లైన్‌లో నిలుచుని ఉంటారు. కారణం.. డాన్ వార్డ్ చతురతే. ఎవరైనా అతని కళ్ల ముందు మురికి పట్టిన షూస్ వేసుకుని పోతుంటే జోక్ వేసి పిలుస్తాడు. దానికి వారు సహజంగానే ఆకర్షితులవుతారు. అలా వారు అతని వద్దకు వచ్చి షూ పాలిష్ చేయించుకుని వెళ్తారు.
అయితే కస్టమర్లను పిలిచేందుకే కాదు, వారి షూస్‌లను పాలిష్ చేసేటప్పుడు కూడా డాన్ వార్డ్ వారితో చనువుగా మాట్లాడుతూ జోక్స్ వేస్తుంటాడు. అందుకనే అతని వద్ద చాలా మంది షూ పాలిష్ చేయించుకునేందుకు వస్తుంటారు. అలా డాన్ వార్డ్ సక్సెస్ బాట పట్టాడు.
గతంలో అతను ఫోటోగ్రాఫర్‌గా పనిచేశాడు. కానీ ఆర్థిక సమస్యలు వచ్చాయి. దీంతో జాబ్ వదిలేసి ఈ పని మొదలు పెట్టాడు. ఇందులో విజయం సాధించాడు. అతను ప్రస్తుతం రోజుకు రూ.60వేల చొప్పున నెలకు రూ.18 లక్షలను సంపాదిస్తున్నాడు. అతన్ని చూసి కొందరు అతని స్నేహితులు కూడా చేస్తున్న ఉద్యోగాలను మానేసి కొన్ని ప్రాంతాల్లో అతని లాగే షూస్ ను పాలిష్ చేసి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు. ఇంత సంపాదించినా తనకు ఉపాధిని అందించింది ఇదే కనుక డాన్ వార్డ్ ఈ వృత్తిలో కొనసాగడం మాత్రం మానలేదు. అవును.. శ్రమను గుర్తించాడు, కనుకనే అందులో కొనసాగుతున్నాడు. ఏది ఏమైనా అతను ఇంతలా విజయం సాధించినందుకు అతన్ని అభినందించాల్సిందే..!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…