శాస్త్రీయంగా చెప్పాలంటే మనం తినే సాధారణ ఆహారం జీర్ణం కావడానికి 24 గంటలు పడుతుంది. కచ్చితమైన సమయం అనేది మీరు తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు వేగంగా జీర్ణమవుతాయి. కొవ్వులు జీర్ణం అయ్యేందుకు సమయం తీసుకుంటాయి. ఆహారం మీ జీర్ణవ్యవస్థ గుండా వెళ్ళడానికి 24 గంటలు పడుతుంది. వీటిలో ద్రవాలు తక్కువ సమయం తీసుకుంటాయి. కచ్చితమైన సమయం పూర్తిగా మీరు తినే ఆహారం, మీ శరీర రకం, జీవక్రియ, లింగం, వయస్సు, కొన్ని ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ జీర్ణక్రియ, శోషణ, ఆహారాన్ని బయటకు విసర్జించడం అనే క్రియలు నిరంతరం జరుగుతుంటాయి.
కార్బోహైడ్రేట్లు వేగవంతంగా జీర్ణమవుతాయి. కొవ్వులు ఎక్కువ సమయం తీసుకుంటాయి. అయితే మాంసం మాటేమిటి ? మాంసం జీర్ణం కావడానికి చాలా రోజుల సమయం పడుతుందా ? అంటే.. మాంసం జీర్ణం కావడానికి 2 నుండి 4 రోజులు పడుతుంది. మీ జీర్ణక్రియ ఆహారాన్ని నమలడం దగ్గర నుంచి నోట్లోనే మొదలవుతుంది. తరువాత ఆహారం జీర్ణాశయంలోకి చేరుతుంది. అక్కడి నుంచి చిన్న పేగుల వద్దకు చేరుతుంది. అక్కడ పోషకాలను శరీరం శోషించుకుంటుంది. మిగిలింది వ్యర్థం రూపంలో బయటకు వస్తుంది. అయితే మాంసాహారం పూర్తిగా జీర్ణం అయ్యేందుకు కనీసం 2 నుంచి 4 రోజుల సమయం అయినా పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కానీ కొన్ని సూచనలు పాటించడం వల్ల మాంసాహారాన్ని త్వరగా జీర్ణం చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
1. మాంసాహారం తిన్న తరువాత నీటిని ఎక్కువగా తాగుతుండాలి. నీరు మాంసాన్ని త్వరగా జీర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది.
2. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. దీంతో జీర్ణాశయంపై తక్కువ భారం పడుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అది మాంసాహారానికి కూడా వర్తిస్తుంది. ఆ ఆహారాన్ని కూడా బాగా నమిలి తినాల్సి ఉంటుంది.
3. మాంసాహారం తిన్నాక పైనాపిల్‌ను తినడం మంచిది. ఈ పండులో బ్రోమెలైన్ అనే సహజ ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్ల మధ్య బంధాలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. దీంతో మాంసాహారం త్వరగా జీర్ణమవుతుంది. కనుక మాంసాహారం తిన్నవారు వెంటనే పైనాపిల్‌ను తింటే మంచిది.
4. మాంసాహారం తిన్న తరువాత బొప్పాయి పండ్లను తినవచ్చు. ఈ పండ్లలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం రాకుండా చూస్తుంది.
5. మాంసాహారం తిన్నాక జామకాయలను కూడా తినవచ్చు. ఇవి కూడా ఆ ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తాయి.
6. మాంసాహారం తిన్నాక చివర్లో పెరుగు లేదా మజ్జిగను తీసుకోవాలి. ఇవి ప్రో బయోటిక్ ఆహారాలు. మాంసాహారాన్ని జీర్ణం చేసేందుకు ఉపయోగపడతాయి.
7. మాంసాహారంలో ఉప్పు, కారం, పసుపు, మసాలాలు కలిపి కొన్ని గంటల పాటు ముందుగా మారినేట్ చేయాలి. దీని వల్ల మాంసాహారం త్వరగా ఉడుకుతుంది. తిన్నా కూడా త్వరగా జీర్ణమవుతుంది.
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…