శాకాహారం

ఘుమ‌ఘుమ‌లాడే గుత్తి వంకాయ బిర్యానీ.. చేసుకోవడం ఎలాగంటే ?

గుత్తి వంకాయ‌ల‌తో స‌హ‌జంగానే చాలా మంది కుర్మా చేసుకుంటారు. కొంద‌రు వాటిని ట‌మాటాల‌తో క‌లిపి వండుతారు. అయితే నిజానికి ఆ వంకాయ‌ల‌తో బిర్యానీ చేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. చికెన్ బిర్యానీ స్టైల్‌లో దాన్ని చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే గుత్తి వంకాయ బిర్యానీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గుత్తి వంకాయ బిర్యానీని త‌యారు చేసే విధానం

మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, యాలక్కాయలు, అనాస పువ్వు, లవంగాలు, ధనియాలు, బిర్యానీ ఆకు, మిరియాల‌ను గ్రైండ్ చేసుకోవాలి. రెండు గ్లాసుల బాస్మతి బియ్యం కడిగి ప‌క్కన ఉంచుకుని, ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్లు పోసి అందులో ఆరు లవంగాలు, నాలుగు యాలక్కాయాలు, రెండు బిర్యానీ ఆకులు, అల్లం వెల్లుల్లి ముద్ద, దాల్చిన చెక్క, షా జీరా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నెయ్యి లేదా నూనె వేయాలి.

బాగా కాగాక బాస్మతి బియ్యం వేసి 3/4 వంతు ఉడికాక చిల్లుల గిన్నెలోకి వంచాలి. బిర్యానీ వండే గిన్నె కింద మట్టు వంపు లేని సమంగా ఉండేది బాగుంటుంది. మట్టు కింద పల్చగా వుంటే కింద పెనం పెట్టు కోవచ్చు. కోసిన వంకాయలలో కొంచెం కొంచెం మసాలా పెట్టి మూకుడు లో నూనె పోసి కాగాక వంకాయలు వేసి నెమ్మదిగా కొద్దిగా వేపాలి. బిర్యానీ వండాల్సిన గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి కొన్ని వేగిన వంకాయలు, మసాలా, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా వేపి ఉల్లి పాయ ముక్క‌లు వేసి ఉడికిన అన్నం కొద్దిగా పరచాలి. తరువాత మిగిలిన వంకాయలు మసాలా వేసి పుదీనా, కొత్తిమీర, ఉల్లి ముక్క‌లు వేయాలి. కొద్దిగా నెయ్యి పైన అంతా వేయాలి. సరిపోయే మూతని పెట్టి బరువుగా ఉండే కల్వం పెడితే గోధుమ పిండితో మూత మూయ‌నవసరం ఉండదు. గ్యాస్‌ సిమ్ లో 20 నిమిషాలు ఉంచితే గుత్తి వంకాయ బిర్యాని రెడీ అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM