ఆదివారం వస్తే చాలు, చాలా మంది చికెన్ లేదా మటన్ తినేందుకు ఇష్టపడుతుంటారు. మటన్ ఖరీదు ఎక్కువగా ఉంటుంది కనుక దాన్ని ఎప్పుడో ఒకసారి గానీ తినరు. ఇక చికెన్ అయితే ఆదివారం అనే కాదు, వారంలో ఏ రోజు తినాలని అనిపిస్తుందో అప్పుడు తినేస్తుంటారు. అయితే చికెన్ కొనేందుకు వెళ్లే వారు ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవేమిటంటే..
* కోళ్లను అప్పుడే కట్ చేసి చికెన్ చేసి ఇస్తే తాజాగా ఉంటాయి. కానీ కొందరు దుకాణదారులు చికెన్‌ను ఎప్పుడో తయారు చేసి ఉంచుతారు. అలాంటి చికెన్‌ను తీసుకోరాదు. ఎందుకంటే మాంసంలో సమయం గడిచే కొద్దీ బాక్టీరియా తయారవుతుంది. కనుక చికెన్‌ను తాజాగా తయారు చేయించి కొనుగోలు చేయాలి. ఇక చికెన్ కొనేటప్పుడు కూడా తాజాగా ఉందో లేదో చెక్ చేయాలి. అంతకు ముందే కట్ చేసింది అయితే కొద్దిగా రంగు మారుతుంది. బ్రౌన్ రంగులో కనిపిస్తుంది. అలాగే తాజా చికెన్‌కు వచ్చే వాసన రాదు. వేరేగా ఉంటుంది. వాటిని వాసన చూడడం ద్వారా ఆ తేడాను కనిపెట్టవచ్చు. కనుక చికెన్‌ను తాజాగా ఉండేలా చూసుకోవాలి. దీంతో దాన్ని వండుకుని తిన్నా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
* తాజా చికెన్ ఎల్లప్పుడూ లేత పింక్ రంగులో కనిపిస్తుంది. చికెన్ ను కట్ చేసినప్పుడు కూడా పింక్ రంగులో దర్శనమిస్తుంది. చికెన్ లోపలి భాగం పింక్ కలర్‌లో లేకపోతే ఆ చికెన్ తాజాగా లేదని అర్థం చేసుకోవాలి. అలాగే తాజా చికెన్‌పై రక్తపు మరకలు కనిపిస్తుంటాయి.
* ఫ్రిజ్ లో నిల్వ చేసిన చికెన్‌ను చాలా మంది విక్రయిస్తుంటారు. మనకు డెలివరీ యాప్‌ల ద్వారా వచ్చే చికెన్ అలాంటిదే. కనుక దాన్ని కొనరాదు. తాజాగా కట్ చేయించి తీసుకోవాలి. లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
* ప్యాక్ చేయబడిన చికెన్‌ను కూడా తినరాదు. అది కూడా నిల్వ చేసిన చికెన్ కిందకే వస్తుంది. కనుక చికెన్‌ను తాజాగా తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామని తెలుసుకోండి.
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…