సాయంత్రం సమయంలో వర్షం పడుతుంటే వేడివేడి కాఫీ తో పాటు ఏవైనా స్నాక్స్ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ఈ వర్షాకాలంలో చల్లచల్లని సాయంత్రాల్లో వేడివేడిగా కరకరలాడే ఆనియన్ రింగ్స్ ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. మరి ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*ఉల్లిపాయలు 5 (రింగులుగా కత్తిరించుకోవాలి)
*కారం టేబుల్ స్పూన్
*ఉప్పు తగినంత
*మైదాపిండి ఒకటిన్నర కప్పు
*నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత
*మిరియాలపొడి టీ స్పూన్
*ఆవాల పొడి టీ స్పూన్
*బ్రెడ్ పౌడర్ అర కప్పు
*చిల్లీ ఫ్లేక్స్ అర కప్పు
ముందుగా ఉల్లిపాయలను విడివిడిగా రింగులు మాదిరిగా కట్ చేసి పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. పది నిమిషాల తర్వాత నీటిలో నుంచి తీసేసి తడి ఆరనివ్వాలి. తరువాత ఒక గిన్నెలోకి మైదాపిండి, ఉప్పు, కారం, మిరియాల పొడి, ఆవాల పొడి, వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరీ పలుచగా కాకుండా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్లేట్లో బ్రెడ్ పౌడర్ చిల్లీ ఫ్లేక్స్ వేసి ఉంచాలి. స్టవ్ మీద ఒక కడాయిలో నూనె పోసి బాగా వేడి చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క ఉల్లిపాయ రింగును తీసుకొని పిండిలో ముంచి ఆ తర్వాత బ్రెడ్ పౌడర్ ఫ్లెక్స్ లో అటు ఇటు తిప్పుతూ నూనెలో వేయించుకుంటే ఎంతో రుచి కరమైన ఆనియన్ రింగ్స్ తయారైనట్లే. వేడి వేడిగా ఉన్న వీటిని టమోటా కెచప్ తో తింటే ఎంతో అద్భుతంగా ఉంటాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…