ఎంతో రుచికరమైన బీట్ రూట్ పకోడీలు తయారీ విధానం..

May 29, 2021 12:08 PM

సాధారణంగా మనం చికెన్ పకోడీ, శనగపిండి పకోడీలు, ఆనియన్ పకోడీ తయారు చేసుకుని తినే ఉంటాం కానీ ఎంతో విభిన్నంగా ఎప్పుడైనా బీట్ రూట్ పకోడీలు తయారు చేశారా.. అయితే ఎంతో రుచి కరమైన బీట్ రూట్ పకోడీలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు

*బీట్‌రూట్‌ తురుము- అర కప్పు

*పచ్చి శనగపప్పు – అర కప్పు(నానబెట్టుకోవాలి),

*జీలకర్ర – పావు టీ స్పూన్,

*అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ – 1 టీ స్పూన్,

*బియ్యప్పిండి – 1 టేబుల్‌ స్పూన్‌,

*మొక్కజొన్న పిండి – 1 టేబుల్‌ స్పూన్‌,

*కారం – 1 టీ స్పూన్‌,

*ఉల్లిపాయలు – 2(చిన్నగా కట్‌ చేసుకోవాలి),

*కొత్తిమీర

*ఉప్పు

*నూనె

తయారీ విధానం

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి బీట్ రూట్ తురుము, పచ్చి శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యప్పిండి, మొక్కజొన్నపిండి, ముందుగా కట్ చేసి చూపించిన ఉల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర తురుము, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి బాగా కలియబెట్టాలి. ఎక్కడ పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ ఉంచి అందులో డీప్ ఫ్రై కి సరిపోయే నూనె వేసుకొని బాగా వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా చిన్నచిన్నగా వేసుకొని బాగా కాలిన తర్వాత తీసేయాలి. ఈ విధంగా వేడివేడి బీట్రూట్ పకోడి లోకి టమోటా కెచప్ తో తీసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment