రుచికరమైన హనీ చిల్లీ పొటాటో.. తయారీ విధానం!

July 11, 2021 8:35 PM

సాయంత్రం సరదాగా ఏదైనా స్నాక్స్ చేసుకుని తినాలనిపిస్తే కొత్తగా హనీ చిల్లీ పొటాటో తయారుచేసుకుని సాయంత్రానికి ఎంతో అందంగా రుచికరంగా ఆస్వాదించండి. ఎంతో రుచి కరమైన ఈ హానీ చిల్లీ పొటాటో చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం హనీ చిల్లీ పొటాటో ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

*బంగాళదుంపలు అరకిలో

*ఎండు మిర్చి 2

*వెల్లుల్లి రెబ్బలు 5

*లవంగాలు ఆరు

*కార్న్ పౌడర్ రెండు స్పూన్లు

*ఉప్పు తగినంత

*నువ్వులు టేబుల్ స్పూన్

*టమోటో సాస్ టేబుల్ స్పూన్

*చిల్లీ సాస్ టేబుల్ స్పూన్

*వెనిగర్ టేబుల్ స్పూన్

*తేనే రెండు టేబుల్ స్పూన్లు

*నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత

తయారీ విధానం

ముందుగా బంగాళా దుంపలను శుభ్రంగా కడిగి తగినన్ని నీటిని పోసి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. విజిల్స్ వచ్చిన తర్వాత బంగాళదుంపలు పై తొక్క తీసి వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్ మాదిరిగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. మరొక గిన్నెలోకి వెల్లుల్లి, లవంగాలు, ఎండు మిర్చిలను మెత్తగా రుబ్బిన మిశ్రమాన్ని వేసుకోవాలి. అదేవిధంగా కార్న్ పౌడర్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి కుంటూ ఈ మిశ్రమాన్ని చిక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు పక్కన ఉంచి తర్వాత చిల్లి మిశ్రమంలోకి బంగాళదుంపలను కలపాలి. అదేవిధంగా స్టవ్పై డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసి నూనె బాగా వేడి అయిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలను వేస్తూ బాగా ఎర్రగా.. క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న బంగాళదుంప ముక్కలను పక్కన పెట్టి స్టవ్ మీద మరొక కడాయి పెట్టాలి. అందులో కొద్దిగా నూనె వేసి చిల్లీ సాస్, టమోటో సాస్, వెనిగర్, తేనె కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.ఈ మిశ్రమంలోకి ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన హనీ చిల్లి పొటాటో తయారైనట్లే. ఈ హనీ చిల్లి పొటాటో పై కొద్దిగా నువ్వుల చల్లుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment