టేస్టీ.. టేస్టీ చికెన్ పకోడీ తయారీ విధానం..!

July 23, 2021 6:12 PM

చాలా మందికి చికెన్ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలోనే చికెన్ తో ఎన్నో రకాల రెసిపీలను తయారు చేసుకొని తింటారు. అయితే ప్రస్తుతం ఉన్న చల్లని వాతావరణంలో వేడి వేడి చికెన్ పకోడీ తయారు చేసుకుని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి చికెన్ పకోడీలను ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

*చికెన్ బోన్ లెస్ అరకిలో

*అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీస్పూన్

*కారం పొడి అర టీ స్పూన్

*కార్న్ పౌడర్ 3 టేబుల్ స్పూన్లు

*ఉప్పు తగినంత

*శెనగపిండి 3 టేబుల్ స్పూన్లు

*నిమ్మకాయ ఒకటి

*కొత్తిమీర కొద్దిగా

*కరివేపాకు

*నాలుగు పచ్చిమిర్చి ముక్కలు

*నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత

*బియ్యం పిండి అరకప్పు

*బేకింగ్ సోడా చిటికెడు

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో చికెన్ వేసి నిమ్మకాయ పిండి చికెన్ మొత్తం కలపాలి. ఈ గిన్నెలోకి పై తెలిపిన పదార్థాలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ చికెన్ ముక్కలు బాగా పట్టుకునేలా కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్ళు వేసి ఈ మిశ్రమం మొత్తం ముక్కలకు పట్టుకునే విధంగా కలిపి ఓ అరగంట పాటు ఫ్రిజ్లో ఉంచాలి.

అరగంట తర్వాత స్టౌ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టి నూనె వేడి అయిన తర్వాత చికెన్ ముక్కలను పకోడీలుగా వేసుకోవాలి. చిన్నమంటపై చికెన్ ముక్కలు బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని తీసేయాలి. ఈ విధంగా వేయించిన చికెన్ పకోడీలను నిమ్మకాయ ఆనియన్స్ తో కలిపి తీసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment