ఆంధ్ర స్టైల్ లో వంటకాలు అంటే ఆటోమేటిక్ గా స్పైసి గా ఉంటాయి. ఇక చికెన్ రెసిపీ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి చికెన్ రెసిపీ పిల్లలు ఎంతో ఫేమస్ అయిన పెప్పర్ చికెన్ ఆంధ్ర స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
*చికెన్ అరకిలో
*వెల్లుల్లి గుప్పెడు
*అల్లం చిన్న ముక్కలు రెండు
*ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు
*పచ్చిమిర్చి 2
*ఉప్పు తగినంత
*కొత్తిమీర కొద్దిగా
*మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్
*ధనియాల పొడి టేబుల్ స్పూన్
*నూనె కొద్దిగా
*లవంగాలు 4
*నిమ్మకాయ ఒకటి
ముందుగా వెల్లుల్లి, అల్లం, లవంగాలను మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మరొక గిన్నెలో చికెన్ ముక్కలు వేసి అందులోకి తయారుచేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని, తగినంత ఉప్పు, పసుపు, నిమ్మకాయ సగం పిండుకొని ఈ మిశ్రమం మొత్తం చికెన్ ముక్కలకు అంటుకునే విధంగా కలిపి ఓ అరగంట పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
అరగంట తర్వాత స్టవ్ పై ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ముదురు బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించుకోవాలి.తరువాత ఈ మిశ్రమం లోకి ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేయాలి. చికెన్ ముక్కలు మెత్తగా కావడం కోసం కొద్దిగా నీటిని వేసుకోవచ్చు. నీరు ఇంటికి పోతున్న సమయంలో మిరియాల పొడి, ధనియాల పొడి కలియ బెట్టాలి. చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయడానికి ముందుగా కొద్దిగా కొత్తిమీర తురుము పైన చల్లుకొని స్టౌ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ పెప్పర్ చికెన్ తయారైనట్లే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…