Ragi Idli : రాగుల‌తో ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన రుచిగా ఉండే ఇడ్లీల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇలా చేసుకోవ‌చ్చు..!

May 19, 2023 6:04 PM

Ragi Idli : చిరుధాన్యాల్లో ఒకటైన రాగుల్లో పోషకాలు అనేకం ఉంటాయి. షుగ‌ర్ ఉన్న వారికి కూడా ఇది చాలా మంచిది. రాగి అంబలి మాత్ర‌మే కాకుండా ఒకసారి రాగిపిండితో ఇడ్లీలు కూడా చేసుకుని తినండి. రవ్వ, పెరుగుతో కలిపి చేయడం వల్ల వీటికి మంచి రుచి వస్తుంది. నూనె లేకుండా, పిండి పులియ బెట్టాల్సిన అవసరం లేకుండా వెంటనే అప్ప‌టిక‌ప్పుడు ఈ ఇడ్లీల‌ను చేసుకోవ‌చ్చు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

రాగి ఇడ్లీ త‌యారీకి కావాల్సిన పదార్థాలు..

రాగి పిండి – 1 క‌ప్పు, స‌న్న ర‌వ్వ – 1 క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, పెరుగు – 1 క‌ప్పు, నీళ్లు – 1 క‌ప్పు, బేకింగ్ సోడా – పావు టీస్పూన్‌.

Ragi Idli how to cook them soft
Ragi Idli

రాగి ఇడ్లీ తయారీ విధానం..

ముందుగా నూనె లేకుండా రవ్వను రెండు నిమిషాలు వేయించాలి. పెద్ద గిన్నెలోకి రవ్వను తీసుకుని రాగిపిండిని కలుపుకోవాలి. ఉప్పు, పెరుగు కూడా వేసి కలుపుకోవాలి. పెరుగు చిక్కదనాన్ని బట్టి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఈ పిండిని అరగంట పక్కన‌ పెట్టుకోవాలి. అరగంటయ్యాక అవసరమైతే ఇంకొన్ని నీళ్లు పోసుకుని ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. ఆవిరి మీద ఇడ్లీ ఉడికించుకునే ముందు కొద్దిగా బేకింగ్ సోడా కూడా కలుపుకోవాలి. దీంతో ఇడ్లీలు గట్టిగా లేకుండా పొంగుతూ వ‌స్తాయి. ఇక ఇడ్లీ కుక్కర్ లో ఇడ్లీ పాత్రలకి నూనె రాసి ఇడ్లీ పిండిని వేసుకోవాలి. మామూలు ఇడ్లీ లాగే ఆవిరి మీద ఉడికించుకుంటే చాలు. రాగి పిండి ఇడ్లీలు త‌యార‌వుతాయి. వీటిని సాంబార్ లేదా చ‌ట్నీతో తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్య‌క‌రం కూడా.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment