కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడంతో చాలా మంది ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు అందక పోవడంతో ఎంతోమంది ఎన్నో అవస్థలు పడుతున్నారు. అయితే కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ వైద్యుల సలహాలు సూచనలను పాటిస్తూ, వ్యాధి బారి నుంచి బయటపడవచ్చు కరోనా వైరస్ సోకినప్పుడు ఇంట్లోనే ఉంటూ ఎటువంటి పనులను చేయాలి.. ఏం చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం..
* కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఒక ప్రత్యేక గదిలో ఉంటూ ఎల్లప్పుడు మాస్కు ధరించి మన గది లోనికి ఇతర కుటుంబ సభ్యులు ప్రవేశించకుండా చూడాలి.
* కరోనా పాజిటివ్ అని తేలినప్పుడు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. తేలికపాటి లక్షణాలు కనిపిస్తే పారాసెట్మాల్ ఉపయోగించాలి. అదేవిధంగా తరచూ ఆక్సిజన్ స్థాయిలను ఆక్సీమీటర్ ద్వారా గమనిస్తూ వుండాలి.
*ఎక్కువగా ద్రవ ఆహార పదార్థాలను తీసుకోవాలి. రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగాలి.
*తరచుగా చేతులను శానిటైజర్ చేస్తూ మాస్కు ధరించి ఉండాలి.
* కరోనా తేలికపాటి లక్షణాలు ఉంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎటువంటి మందులను ఉపయోగించకూడదు.
* లక్షణాలు అధిక స్థాయిలో ఉండి, ఆక్సిజన్ స్థాయిలు పడిపోతూ ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి.
*వాడిన మాస్క్ లను మళ్లీ మళ్లీ వాడకూడదు. సొంత వైద్యం పనికిరాదు.
* కోవిడ్ లక్షణాలు ఉన్నవారు కేవలం ఒక గదిలోకి మాత్రమే పరిమితమై ఉండాలి బయటకు రావడం ఇతరులతో మాట్లాడటం చేయకూడదు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…