బాబోయ్‌.. ఆ స్వీట్ల ధ‌ర ఎంతో తెలుసా ? కిలో రూ.9వేలు..

August 17, 2021 8:12 PM

రాఖీ పండుగ వ‌స్తుందంటే చాలు అక్క చెల్లెల్లు త‌మ అన్న‌ద‌మ్ముల‌కు రాఖీల‌ను క‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతుంటారు. దూర ప్రాంతాల్లో ఉండేవారి కోసం రాఖీల‌ను ముందుగానే కొని కొరియ‌ర్లు లేదా పోస్టులో పంపిస్తుంటారు. ఇక ఈ పండుగ సంద‌ర్భంగా స్వీట్ల‌ను కూడా ఎక్కువ‌గా తినిపించుకుంటుంటారు. దీంతో స్వీట్ల‌కు గిరాకీ ఎక్కువ‌గా ఉంటుంది.

బాబోయ్‌.. ఆ స్వీట్ల ధ‌ర ఎంతో తెలుసా ? కిలో రూ.9వేలు..

అయితే రాఖీ పండుగ సంద‌ర్భంగా స్వీట్ల‌కు ఉండే గిరాకీని దృష్టిలో ఉంచుకుని గుజ‌రాత్‌లోని సూర‌త్‌కు చెందిన ఓ షాపు య‌జ‌మాని ఏకంగా బంగారంతో స్వీట్ల‌ను త‌యారు చేసి విక్ర‌యిస్తున్నాడు. అక్క‌డి ఘోద్దోద్ రోడ్ ఏరియాలో ఓ షాపు య‌జ‌మాని బంగారం పూత క‌లిగిన స్వీట్ల‌ను విక్ర‌యిస్తున్నాడు.

సాధార‌ణంగా స్వీట్ల‌పై సిల్వ‌ర్ ఫాయిల్ ఉంటుంది. కానీ ఆ షాపు య‌జమాని త‌యారు చేయిస్తున్న ఆ స్వీట్ల‌పై 24 క్యారెట్ల బంగారం పూత ఉంటుంది. ఇక ఆ స్వీట్ల‌ను కేజీకి రూ.9000 గా విక్ర‌యిస్తున్నారు. బంగారం పూత ఉంటుంది కాబ‌ట్టే వాటిని ఆ ధ‌ర‌కు అమ్ముతున్నారు.

అయితే స్వీట్ల‌కు అంత ధ‌ర ఉన్న‌ప్ప‌టికీ తమ వ్యాపారం బాగుంద‌ని ఆ స్వీట్ షాపు నిర్వాహ‌కులు చెబుతున్నారు. అలాంటి స్వీట్ల‌ను కొనుగోలు చేసేందుకు కూడా చాలా మంది ఆస‌క్తిని చూపిస్తున్నార‌ని అంటున్నారు. ఇక ఈ సీజ‌న్‌లో సూర‌త్‌లో ఇలా స్వీట్ల‌ను త‌యారు చేయ‌డం మామూలే. కానీ ఈసారి మాత్రం కాస్త ఎక్కువ ధ‌ర‌కే స్వీట్ల‌ను విక్ర‌యిస్తుండ‌డం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment