Surgeons In Clothes : స్కూల్స్, కాలేజీలకు వెళ్లినప్పుడు యూనిఫాం.. ఆఫీసులకు వెళ్తే ఫార్మల్ డ్రెస్సులు.. ఫంక్షన్లకు వెళ్తే పార్టీ వేర్.. ఇంటి దగ్గర ఉంటే సాధారణ డ్రెస్సులు.. రాత్రిపూట నైట్ డ్రెస్.. ఇలా మనం ధరించే దుస్తులు ఆయా సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే హాస్పిటల్‌లలో వైద్యులు ధరించే దుస్తులు మాత్రం తెల్లగా ఉంటాయి. అదే వారు ఆపరేషన్ వంటివి చేస్తే ఆకుపచ్చ లేదా నీలం రంగుతో కూడిన దుస్తులు ధరిస్తారు. ఎందుకు..? తెలుసుకుందాం రండి. మామూలు సందర్భాల్లో అయితే హాస్పిటల్స్‌లో డాక్టర్లు తెల్ల రంగు వస్ర్తాలనే ధరిస్తారు. ఎందుకంటే తెలుపు స్వచ్ఛతకు, శుభ్రతకు సంకేతం కాబట్టి, వారు కూడా అదే విధంగా ఉండాలి కాబట్టి. తెల్ల రంగు బట్టలను ధరిస్తారు.
అయితే ఆపరేషన్లు చేసే సమయంలో మాత్రం గ్రీన్ లేదా బ్లూ కలర్ వస్ర్తాలు ధరిస్తారు. కానీ ఇదేమీ కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు. 20వ శతాబ్దం ఆరంభంలో ఓ వైద్యుడు ఈ విధానాన్ని ప్రారంభించాడు. ఈ విధానం ప్రకారం డాక్టర్లు ఆపరేషన్ సమయంలో గ్రీన్ లేదా బ్లూ కలర్ దుస్తులు ధరించాలి. అలా చేస్తే ఎరుపు రంగులో ఉండే పేషెంట్ అవయవాలను, వాటి రంగులు, మార్పులను సులభంగా పసిగట్టవచ్చట. సాధారణంగా ఆపరేషన్లు చేసే వైద్యులు ఎక్కువ సేపు రక్తాన్ని, ఎరుపు రంగును చూస్తారు. కాబట్టి ఈ రంగును చూసిన తరువాత మిగతా రంగులను గుర్తించడం కొంత కష్టతరమవుతుందట. ఈ క్రమంలో తెలుపు రంగు బట్టలు వేసుకుని ఉంటే ఆ వైద్యులకు ఆకుపచ్చని రంగు కలిగిన గీతలు భ్రమ రూపంలో పదే పదే కనిపిస్తాయట.
దీన్ని నివారించడం కోసం వైద్యులు ఆకుపచ్చని వస్ర్తాలను ఎక్కువగా ధరిస్తారట. దీంతో వారికి కనిపించే ఆకుపచ్చని గీతలు ఆ డ్రెస్‌లో కలిసిపోయి కంటికి ఇతర రంగులు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే నీలి రంగు వస్ర్తాలు ధరించినా ఈ సమస్య నుంచి బయట పడవచ్చట. ఎరుపు రంగును ఎక్కువ సేపు చూస్తే మెదడులో రంగులను గుర్తించే సంకేతాలు బలహీనమవుతాయట. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ చేసే సమయంలో డాక్టర్లు తాము వేసుకున్న ఆకుపచ్చ, నీలం రంగు బట్టలను మధ్య మధ్యలో చూసేందుకు గాను ఈ విధానాన్ని కనుగొన్నారు. ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ పడోవాలో విజువల్ ఇల్యూషన్స్ అనే అంశంపై పరిశోధనలు చేస్తున్న పౌలా బ్రెస్సాన్ అనే శాస్త్రవేత్త కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటించి చెబుతున్నారు. సో, ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు గ్రీన్, బ్లూ కలర్ బట్టలు ఎందుకు వేసుకుంటారో తెలిసింది కదా..!
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…