ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు ప్లాబో పికాసో పెయింటింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పికాసో పెయింటింగ్ ఎంత డిమాండ్ ఉంటుందో మనకు తెలిసిందే. ఇప్పటికీ అతను వేసిన పెయింటింగ్ కొన్ని వందల కోట్లకు అమ్ముడు పోయాయి. ఈ క్రమంలోనే పికాసో గీసిన మరొక పెయింటింగ్ కోట్లలో అమ్ముడు పోయి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పికాసో పెయింటింగ్స్ కోట్లలో అమ్మడు పోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా.. అక్కడే అసలైన ట్విస్ట్ దాగి ఉంది.
1932లో గీసిన ఓ పెయింటింగ్‌కి తాజాగా రికార్డు ధర పలికింది. వంద, రెండు వందల కోట్లు కాదు. ఏకంగా 758 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి రికార్డు సృష్టిస్తోంది. కిటికీ వద్ద ఎంతో అందంగా కూర్చున్నటు వంటి యువతి ఫోటో వేలంలో అంత ధర పలకడం చూసి అందరూ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
1932లో పూర్తయిన మేరీ థెరిసె(కిటికీ వద్ద కూర్చుని ఉన్న యువతి) పెయింటింగ్‌ని న్యూయార్క్‌కి చెందిన క్రిస్టైన్స్ సంస్థ గురువారం వేలం వేసింది. బిడ్డింగ్ ప్రారంభమైన కేవలం 19 నిమిషాల్లోనే 103.4 మిలియన్ డాలర్లకు భారత కరెన్సీ ప్రకారం రూ. 758 కోట్లకు ఈ పెయింటింగ్ అమ్ముడుపోయింది.ఈ పెయింటింగ్ సుమారు 55 మిలియన్ డాలర్లు ధర పలుకుతుందని భావించగా ఏకంగా 103.4 మిలియన్ డాలర్లు ధర పలకడం ఎంత ఆశ్చర్యంగా ఉందని వేలం సంస్థ తెలిపింది. దీంతో వంద మిలియన్ డాలర్ల మార్కు దాటిన పికాసో చిత్రాల సంఖ్య ఐదుకి పెరిగింది. ప్రస్తుతం ఉన్న కరోనా విపత్కర పరిస్థితులలో కళాపోషణ ఏ మాత్రం తగ్గలేదని ఆ సంస్థ సంతోషం వ్యక్తం చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…