కరోనా సమయంలోనూ తగ్గని కళాపోషణ..ఈ పెయింటింగ్ ధర తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే!

May 17, 2021 12:09 PM

ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు ప్లాబో పికాసో పెయింటింగ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పికాసో పెయింటింగ్ ఎంత డిమాండ్ ఉంటుందో మనకు తెలిసిందే. ఇప్పటికీ అతను వేసిన పెయింటింగ్ కొన్ని వందల కోట్లకు అమ్ముడు పోయాయి. ఈ క్రమంలోనే పికాసో గీసిన మరొక పెయింటింగ్ కోట్లలో అమ్ముడు పోయి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పికాసో పెయింటింగ్స్ కోట్లలో అమ్మడు పోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా.. అక్కడే అసలైన ట్విస్ట్ దాగి ఉంది.

1932లో గీసిన ఓ పెయింటింగ్‌కి తాజాగా రికార్డు ధర పలికింది. వంద, రెండు వందల కోట్లు కాదు. ఏకంగా 758 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి రికార్డు సృష్టిస్తోంది. కిటికీ వద్ద ఎంతో అందంగా కూర్చున్నటు వంటి యువతి ఫోటో వేలంలో అంత ధర పలకడం చూసి అందరూ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

1932లో పూర్తయిన మేరీ థెరిసె(కిటికీ వద్ద కూర్చుని ఉన్న యువతి) పెయింటింగ్‌ని న్యూయార్క్‌కి చెందిన క్రిస్టైన్స్ సంస్థ గురువారం వేలం వేసింది. బిడ్డింగ్ ప్రారంభమైన కేవలం 19 నిమిషాల్లోనే 103.4 మిలియన్ డాలర్లకు భారత కరెన్సీ ప్రకారం రూ. 758 కోట్లకు ఈ పెయింటింగ్ అమ్ముడుపోయింది.ఈ పెయింటింగ్ సుమారు 55 మిలియన్ డాలర్లు ధర పలుకుతుందని భావించగా ఏకంగా 103.4 మిలియన్ డాలర్లు ధర పలకడం ఎంత ఆశ్చర్యంగా ఉందని వేలం సంస్థ తెలిపింది. దీంతో వంద మిలియన్ డాలర్ల మార్కు దాటిన పికాసో చిత్రాల సంఖ్య ఐదుకి పెరిగింది. ప్రస్తుతం ఉన్న కరోనా విపత్కర పరిస్థితులలో కళాపోషణ ఏ మాత్రం తగ్గలేదని  ఆ సంస్థ సంతోషం వ్యక్తం చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now