కర్పూరం, లవంగం, వాముతో ఆక్సిజన్ స్థాయిలు నిజంగా పెరుగుతాయా?

April 18, 2021 5:25 PM

దేశం మొత్తం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటే ఈ భయంకరమైన మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సరైన ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు.

ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులలో లవంగాలు, కర్పూరం, వాము వీటిలోకి కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ కలిపి వాటిని ఒక గుడ్డలో మూట కట్టి ఉదయం, రాత్రి సమయాలలో వాసన చూడటం ద్వారా మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయట. లడక్ లోనే పర్యాటకులు తమ ఆక్సిజన్ స్థాయిలను పెంచుకోవడం కోసం ఈ విధంగా చేస్తారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ విషయంపై స్పందించిన నిపుణులు దీనిలో ఏమాత్రం వాస్తవం లేదని, కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొనే సామర్థ్యం వీటిలో లేదని, కర్పూరం, లవంగాలు కేవలం దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందడానికి మాత్రమే వీలవుతుందని తెలియజేశారు. ఇది కరోనాకు విరుగుడుగా పని చేస్తాయన్న ఆధారాలు ఎక్కడా లేవని నిపుణులు తెలియజేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment