ఉల్లిపాయ‌లు, రాక్ సాల్ట్ క‌లిపి తింటే 15 నిమిషాల్లోనే కోవిడ్ న‌యం అవుతుందా ? నిజ‌మెంత ?

April 22, 2021 5:16 PM

దేశ‌వ్యాప్తంగా రోజు రోజుకీ న‌మోద‌వుతున్న క‌రోనా కేసుల సంఖ్య విప‌రీతంగా పెరిగిపోయింది. గ‌త వారం రోజులుగా రోజుకు 2.50 ల‌క్ష‌ల‌కు పైగా కోవిడ్ కేసులు న‌మోద‌వుతుండ‌గా ఇప్పుడ‌ది 3 ల‌క్ష‌లు దాటింది. దీంతో వైద్య నిపుణులు ఆందోళ‌న చెందుతున్నారు. ప్ర‌భుత్వాలు వెంట‌నే స్పందించి చ‌ర్య‌లు తీసుకోక‌పోతే మ‌రింత ప్ర‌మాదం త‌లెత్తే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. అయితే ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితిలో కొంద‌రు ఫేక్ న్యూస్‌ను ప్ర‌చారం చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. దీంతో కోవిడ్‌పై రోజూ ర‌క‌ర‌కాల ఫేక్ వార్త‌లు ప్ర‌చార‌మ‌వుతున్నాయి.

can eating raw onions with rock salt cures covid in 15 minutes know the truth

ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌ను రాక్ సాల్ట్‌తో క‌లిపి తింటే కేవ‌లం 15 నిమిషాల్లోనే క‌రోనా న‌యం అవుతుంద‌నే ఒక వార్త ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. దీన్ని పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేద‌ని, కోవిడ్ ప్ర‌మాద‌క‌ర‌మైన వైర‌స్ అని, అంత‌టి వైర‌స్‌ను నాశ‌నం చేసే శ‌క్తి ఉల్లిపాయ‌ల‌కు, రాక్ సాల్ట్‌కు లేద‌ని వైద్య నిపుణులు తెలిపారు.

అందువ‌ల్ల సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ఇలాంటి వార్త‌ల‌ను న‌మ్మ‌కూడ‌ద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఎవ‌రికైనా ఇలాంటి మెసేజ్‌లు వ‌స్తే ఒక‌టికి రెండు సార్లు త‌నిఖీ చేసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు. లేదంటే న‌ష్టపోయే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now