విడుదలకు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డ్.. తెలుగు రాష్ట్రాల్లో రూ.120 కోట్ల డీల్!

కేజీఎఫ్ స్టార్ య‌ష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ విడుదలకు ముందే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ (SVC) రూ.120 కోట్లకు దక్కించుకుంది.

February 7, 2026 7:25 PM
Yash Toxic movie Telugu states distribution rights news.
తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో అమ్ముడైన ‘టాక్సిక్’ థియేట్రికల్ హక్కులు. Photo Credit: Toxic Movie Team.

కేజీఎఫ్ స్టార్ య‌ష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ విడుదలకు ముందే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ (SVC) రూ.120 కోట్లకు దక్కించుకుంది. ఇది తెలుగులో రూపొందించని చిత్రానికి ఇప్పటివరకు కుదిరిన అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ ఒప్పందంగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ హక్కుల కోసం ముగ్గురు అగ్రశ్రేణి డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడగా, చివరకు నిర్మాత దిల్ రాజు తృత్వంలోని ఎస్‌వీసీ ఈ డీల్‌ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక చిత్రానికి రూ.120 కోట్ల పంపిణీ ఒప్పందం కుదరడం అరుదైన విషయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కేజీఎఫ్ 2 తర్వాత మరింత పెరిగిన యష్ మార్కెట్..

కేజీఎఫ్ 2 తర్వాత యష్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన అభిమాన గణం మరింత విస్తరించిందని, నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం కావడంతో టాక్సిక్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయని దిల్ రాజు అన్నారు. కేజీఎఫ్ 2 తర్వాత యష్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా మరింత బలపడింది. నాలుగేళ్ల నిరీక్షణతో ఈ సినిమాపై ఏర్పడిన బజ్ అసాధారణంగా ఉంది. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మా అదృష్టం.. అని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి కథను యష్‌తో కలిసి గీతు మోహ‌న్ దాస్ రచించగా, దర్శకత్వం కూడా ఆమెనే వహిస్తున్నారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఒకేసారి షూటింగ్ పూర్తి చేసిన ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళం సహా పలు భాషల్లో డబ్బింగ్ వెర్షన్లుగా విడుదల చేయనున్నారు.

మార్చి 19న విడుద‌ల‌..

టెక్నికల్ విభాగంలో నేషనల్ అవార్డు విజేత సినిమాటోగ్రాఫర్ రాజీవ్ ర‌వి, సంగీత దర్శకుడు ర‌వి బ‌స్రూర్‌, ఎడిటర్ ఉజ్వ‌ల్ కుల‌క‌ర్ణి, ప్రొడక్షన్ డిజైనర్ టీపీ ఆబిద్ కీలకంగా పనిచేశారు. యాక్షన్ సన్నివేశాలను జాన్ విక్ ఫేమ్ జేజే పెర్రీ, నేషనల్ అవార్డు గ్రహీత అంబ‌రీవ్‌, థాయ్‌లాండ్‌కు చెందిన కీచా ఖాంఫాక్డే రూపొందించారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్ష‌న్స్‌, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లపై వెంక‌ట్ కె.నారాయ‌ణ‌, యష్ కలిసి నిర్మిస్తున్నారు. టాక్సిక్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రిలీజ్ తేదీ ఈద్, ఉగాది, గుడి పడ్వా వంటి పండుగల సీజన్‌కు అనుకూలంగా ఉండటంతో, పలు మార్కెట్లలో భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశముందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment