టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే లవర్ బాయ్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఉదయ్ కిరణ్. లవ్ స్టోరీ కథల్ని తెరకెక్కిస్తూ యూత్ లో విపరీతమైన క్రేజ్ ని అందుకున్నారు. చిత్రం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగారు.
కెరీర్ లో వచ్చిన ఇబ్బందులతో ఉదయ్ కిరణ్ ఎంత త్వరగా స్టార్ హీరో స్టేటస్ ని సొంతం చేసుకున్నాడో అంతే స్పీడ్ తో డౌన్ ఫాల్ అయ్యాడు. సినిమా ఆఫర్లు తగ్గిపోవడం, వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి పోవడంతో తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. మళ్ళీ కెరీర్ అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో ఆయన మరణ వార్త టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతోపాటు ఆయన అభిమానుల్ని కూడా కలచివేసింది.
తాజాగా ఉదయ్ కిరణ్ కు తల్లిగా పలు చిత్రాలలో నటించిన సీనియర్ నటి సుధ ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయి ఉంటారని యాంకర్ సుధని ప్రశ్నించగా…అతను చాలా మానసిక వేదనకు గురై ఉంటాడని, ఎవరు అనే విషయం మాత్రం నేను బయట పెట్టలేనని సుధ అన్నారు. చాలామందిలో కొంతమంది తమను ఇబ్బంది పెట్టే వారి పేర్లను బయటకు చెబుతారు. కానీ మరి కొంతమందేమో ఎవరికీ చెప్పకుండా లోలోపల బాధపడతారని నటి సుధ అన్నారు.
ఉదయ్ కిరణ్ ఎంతో బాధ అనుభవించి ఉంటాడు. అందుకే అలా ఆత్మహత్య చేసుకుంటాడని సుధా ఇంటర్వ్యూలో చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే చాలామంది ఇలా డిప్రెషన్ కి లోనవుతే కౌన్సిలింగ్ ఇస్తారు. కానీ ఈయన మాత్రం కౌన్సిలింగ్ తీసుకున్నంత వరకే బాగుండి ఆ తర్వాత మళ్ళీ ఎదా స్థితికి వచ్చి ఉంటాడు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడని సుధ పేర్కొన్నారు.
ఉదయ్ కిరణ్ చనిపోవడానికి రెండు నెలల ముందు నేను అతని దత్తత తీసుకోవాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పని జరగలేదన్నారు సుధ. కానీ ఉదయ్ కిరణ్ తన చివరి రోజుల్లో తన వద్దకు వచ్చి నా కాళ్లు గట్టిగా పట్టుకొని నేను ఒంటరినై పోతున్నాని ఏడ్చాడు. ఆ టైం లో నా పక్కన చలపతిరావు గారు కూడా ఉన్నారు. ఇద్దరం ఉదయ్ కిరణ్ ని ఓదార్చాము. నేను అతన్ని ఓదారుస్తూ ఏం కాదు బాబు నేను నీకు బిజినెస్ పెట్టిస్తా, అన్నీ సక్రమంగా నడుస్తాయి అని చెప్పినా కూడా తను మాట వినలేదు అని సుధ ఇంటర్వ్యూ ద్వారా ఎమోషనల్ గా ఉదయ్ కిరణ్ గురించి చెప్పుకొచ్చారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…