Venky 75 OTT Streaming : వెంకీ 75 స్పెష‌ల్ ఈవెంట్ ఓటీటీలో అల‌రించేందుకు సిద్ధం.. ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే..!

January 1, 2024 4:26 PM

Venky 75 OTT Streaming : విక్ట‌రీ వెంక‌టేష్ తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో వైవిధ్య‌మైన చిత్రాల‌లో న‌టించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్నాడు. ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తున్నాడు. అలానే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల‌తో అల‌రిస్తున్నాడు. వెంకీ ఇప్పుడు కుటుంబ క‌థా చిత్రాలు చేస్తూనే మ‌రోవైపు రానా నాయుడు లాంటి బోల్డ్ కంటెంట్ నేప‌థ్యం ఉన్న వెబ్ సిరీస్ చేసారు. ఓ వెబ్ సిరీస్‌‌ చేశారు. తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శైలేష్ కొలనుతో ‘సైంధవ్’ సినిమాను చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్ 22న వస్తున్నట్లు ప్ర‌క‌టించారు. అదే డేట్‌కు సలార్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో సైంధవ్ డేట్ మార్చుకోవాల్సి వచ్చింది.

ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు టీమ్ తాజాగా ప్రకటించింది. వచ్చే సంవత్సరం జనవరి 13న భారీగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే రీసెంట‌గా వెంకీ 75 అనే కార్యక్రమాన్ని నిర్వహించింది సైంథ‌వ్ మూవీ నిర్మాత‌ల బృందం. వెంకీ 75 సినిమాల ప్రయాణాన్ని తెలిపే విధంగా కలియుగ పాండవులు నుంచి సైంధవ్‌ వరకు తన సినీ ప్రయాణాన్ని తెలుపుతూ ఓ షో నిర్వహించారు.ఈ ఈవెంట్ కి చిరంజీవి , రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే నాని, శ్రీవిష్ణు, అడివిశేష్, బ్రహ్మానందం, అలీ, నిఖిల్, విశ్వక్ సేన్, అనిల్ రావిపూడి.. ఇలా పలువురు సినీ ప్రముఖులతో పాటు చిత్రయూనిట్ ఈ ఈవెంట్ కి విచ్చేశారు.

Venky 75 OTT Streaming know the details
Venky 75 OTT Streaming

వెంకీ 75 ఈవెంట్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ యాప్ ఈ విన్ కొనుక్కోవడంతో ఈవెంట్ ని బయట టెలికాస్ట్ చేయలేదు. అయితే ఈ ఈవెంట్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ప్రోమో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ ఈవెంట్లో కామెడీ స్కిట్స్, డ్యాన్సులు, పాటలు, ఎమోషనల్ స్పీచ్ లు, గేమ్స్.. ఇలా అన్ని కలగలిపి ఉన్నాయి. ప్రస్తుతం వెంకీ 75 ఈవెంట్ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.‘వెంకీ 75 కలియుగ పాండవులు – సైంధవ్’ పేరిట డిసెంబర్ 27న భారీగా జ‌రిగిన ఈ ఈవెంట్ నేటి సాయంత్రం ఆరు గంట‌ల‌కు ఈటీవీ విన్’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కానుంది. “వెంకీ మామ మాస్ జాతర అంటున్నా. ఈవెంట్ అదిరిపోద్ది అంటున్నా.. ఇచ్చి పడేస్తున్నాం అంటున్నా. ఐకానిక్ ల్యాండ్‍మార్క్ ఈవెంట్ వెంకీ 75 డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రీమియర్ అవుతుంది” అని ఈటీవీ విన్ ట్వీట్ చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now