Veera Simha Reddy : అఖండ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత బాలయ్య నటించిన చిత్రం వీరసింహారెడ్డి. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న భారీగా విడుదలై మంచి ఆదరణ పొందుతున్న ఈ సినిమా బాలయ్య సినీ కెరీర్‌లో ఓ అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేసి వావ్ అనిపించింది. అఖండ తర్వాత రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరిన రెండో బాలయ్య చిత్రంగా వీరసింహారెడ్డి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమా ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది.
వీరసింహారెడ్డి సినిమా థియేటర్ బిజినెస్ దాదాపుగా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుండగా, ఇప్పటిదాకా వచ్చిన కలెక్షన్స్ ఎంత..అనేది చూస్తే, ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ షేర్ …75.7 కోట్లు సాధించింది. అఖండ తర్వాత ఈ సినిమా మరోసారి భాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. అయితే గ్రాస్ నెంబర్స్ విషయంలో చూస్తే మాత్రం అఖండ టాప్ లో ఉంది. ఇప్పటికీ కొన్నిచోట్ల పర్శంటేజ్ మీద ఈ సినిమా ఆడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం క్లోజింగ్ 75.90 కోట్లు సాధించిందని అంటున్నారు.
ఇక ఆంధ్రా,తెలంగాణా కలిసి 65.50 Cr, ఓవర్ సీస్ 5.85 Cr, రెస్టాఫ్ ఇండియా 4.55 Cr వచ్చింది. ప్రీ రిలీజ్ బిజినెస్ 75 కోట్లు వసూలు చేయడంతో ఈ సినిమా సకెస్స్ ఫుల్ గా నడిచింది. అలాగే…ఈ సినిమా ఓటిటి రైట్స్, శాటిలైట్ రైట్క్, యూట్యూబ్ రైట్స్, హిందీ రైట్స్ అదనం. వాటిద్వారా భారీగా నిర్మాతకు లాభం వస్తుంది. వీరసింహారెడ్డి చిత్రం టాక్‌తో సంబంధంలేకుండా ఓపెనింగ్స్ భారీ స్థాయిలో రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా ఈ రెండు సినిమాలకు మంచి వసూళ్లు వచ్చాయి. ప్రధానంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు కనకవర్షం కురిపించాయి అనే చెప్పాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…