Vaazhai OTT Release : వ‌రుస హిట్స్ ఇచ్చిన ద‌ర్శ‌కుడి మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోకి రాబోతుందా..!

January 3, 2024 4:36 PM

Vaazhai OTT Release : ఇటీవ‌లి కాలంలో చాలా మంది ద‌ర్శ‌కులు డైరెక్ట్‌గా ఓటీటీలోకి తీసుకురావ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. కొంద‌రు త‌ప్ప‌ని ప‌రిస్థితుల‌లో విడుద‌ల చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రు కావాల‌నే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. కలైయరసన్ మరియు నిఖిలా విమల్ నటించిన వాజై తమిళ డ్రామా చిత్రం కాగా, మరి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు . మారి తెర‌కెక్కించిన మామ‌న్న‌న్‌, క‌ర్ణ‌న్‌,తో పాటు పెరియారుమ్ పెరుమాల్ సినిమాలు కోలీవుడ్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచాయి. ఆయన ప్ర‌తి చిత్రంలో కూడా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. స‌మాజంలో అణ‌గారిన వ‌ర్గాలు ఎదుర్కొంటున్న వివ‌క్ష‌, స‌మ‌స్య‌ల‌ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో చూపిస్తూ ప‌లు అవార్డ్‌లు కూడా అందుకున్నారు.

ఆయ‌న తాజాగా వాజై అనే చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా, ఈ మూవీ థియేట‌ర్‌లో విడుద‌ల అవుతుంద‌ని అంద‌రు భావించారు. కాని ఊహించ‌ని విధంగా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. వాజై మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. వీలైనంత త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మూడు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత మారి సెల్వ‌రాజ్ డైరెక్ష‌న్‌లో వ‌స్తోన్న వాజై మూవీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కావ‌డం కోలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ వాజై సినిమాను నిర్మించిన క్ర‌మంలోనే ఈ మూవీని థియేట‌ర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుద‌ల చేస్తున్నార‌ని స‌మాచారం.

Vaazhai OTT Release know the platform and streaming details
Vaazhai OTT Release

ఇక వాజై సినిమాకు ద‌స‌రా ఫేమ్ సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తూత్తుకుడిలో జరిగింది. ఈ చిత్రం కూడా సోష‌ల్ మెసేజ్‌తో ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులోని ప్ర‌తి సన్నివేశం ప్రేక్ష‌కుల‌కి థ్రిల్ అందించే విధంగా ఉంటుంద‌ని ప్రేక్ష‌కులు ఈ మూవీని తప్ప‌క ఇష్ట‌ప‌తార‌ని మేక‌ర్స్ అంటున్నారు. ఈ సినిమా కోసం త‌మిళ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now