రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం తన సోదరి పెళ్లి వేడుకలతో బిజీగా ఉంది. దోమకొండ గండికోటలో ఘనంగా వేడుకలు జరుగుతుండగా, ఈ వేడుకల‍్లో భాగంగా కామినేని వారి సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు పోచమ‍్మ పండుగను నిర్వహించారు. ఈ కార్యక‍్రమానికి మెగాస్టార్ కుటుంబం కూడా హాజరైంది. ఈ కార్యక్రమాలకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నిత్యం షేర్ చేస్తూ నెటిజన్స్ ని అలరిస్తోంది ఉపాసన.
తాజాగా పోచమ్మ గుడికి వెళ్లినప్పుడు ధరించిన దుస్తుల గురించి చెప‍్పుకొచ్చారు. తొమ్మిదేళ్ల క్రితం తన పెళ్లి వేడుకల‍్లో భాగంగా పోచమ్మ పండుగ సెలబ్రేషన్స్‌లో వేసుకున్న దుస్తులను రీక్రియేట్ చేసి ఇప్పుడు తన సోదరి వివాహ వేడుక సందర్భంగా వేసుకున్నట్లుగా ఉపాసన పేర్కొన్నారు. దుస్తులను వేసుకోవడం, వాటిని జాగ్రత్తగా భద్రపరచడం నాకు ఎంతో ఇష్టం. అంది నాకు గర్వంగా ఉంటుంది అని ఉపాసన పేర్కొంది.
సుమారు తొమ్మిదేళ్ల తర్వాత దోమకొండలో నా పెళ్లికి సంబంధించిన పోచమ్మ పండుగ సెలబ్రేషన్స్ దుస్తులను రీక్రియేట్ చేసినందుకు అనామిక ఖన్నాకు థ్యాంక్స్ అని తెలిపారు. అలాగే ప్రస్తుత ఫొటోలతోపాటు తన వివాహ ఫొటోలను షేర్ చేసుకుంది ఉపాసన. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్‌కు పలువురు స్పందించగా, స్టార్ హీరోయిన్ సమంత ‘బ్యూటిఫుల్’ అంటూ ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…