ఆ విష‌యంలో ఎమోష‌న‌ల్ అయిన ఉపాస‌న‌.. స్ట‌న్నింగ్ కామెంట్ చేసిన స‌మంత‌..

December 7, 2021 11:48 AM

రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి, మెగా కోడ‌లు ఉపాస‌న ప్ర‌స్తుతం త‌న సోద‌రి పెళ్లి వేడుక‌లతో బిజీగా ఉంది. దోమకొండ గండికోటలో ఘనంగా వేడుక‌లు జ‌రుగుతుండ‌గా, ఈ వేడుకల‍్లో భాగంగా కామినేని వారి సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు పోచమ‍్మ పండుగను నిర్వహించారు. ఈ కార్యక‍్రమానికి మెగాస్టార్‌ కుటుంబం కూడా హాజరైంది. ఈ కార్య‌క్ర‌మాల‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నిత్యం షేర్ చేస్తూ నెటిజ‌న్స్ ని అల‌రిస్తోంది ఉపాస‌న‌.

upasana konidela got emotional samantha comment viral

తాజాగా పోచమ్మ గుడికి వెళ్లినప్పుడు ధరించిన దుస్తుల గురించి చెప‍్పుకొచ్చారు. తొమ్మిదేళ్ల క్రితం తన పెళ్లి వేడుకల‍్లో భాగంగా పోచమ్మ పండుగ సెలబ్రేష‍న్స్‌లో వేసుకున్న దుస్తులను రీక్రియేట్‌ చేసి ఇప్పుడు తన సోదరి వివాహ వేడుక సందర్భంగా వేసుకున్నట్లుగా ఉపాసన పేర్కొన్నారు. దుస్తులను వేసుకోవడం, వాటిని జాగ్రత్తగా భద్రపరచడం నాకు ఎంతో ఇష్టం. అంది నాకు గర్వంగా ఉంటుంది అని ఉపాస‌న పేర్కొంది.

సుమారు తొమ్మిదేళ్ల తర్వాత దోమకొండలో నా పెళ్లికి సంబంధించిన పోచమ్మ పండుగ సెలబ్రేషన్స్‌ దుస్తులను రీక్రియేట్‌ చేసినందుకు అనామిక ఖన్నాకు థ్యాంక్స్ అని తెలిపారు. అలాగే ప్రస్తుత ఫొటోలతోపాటు తన వివాహ ఫొటోలను షేర్‌ చేసుకుంది ఉపాస‌న‌. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ పోస్ట్‌కు పలువురు స్పందించగా, స్టార్‌ హీరోయిన్‌ సమంత ‘బ్యూటిఫుల్‌’ అంటూ ఇచ్చిన రియాక్ష‌న్ వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment