Unstoppable With NBK : నందమూరి బాలకృష్ణ నటుడిగా, హోస్ట్‌గా అదరగొడుతున్న విషయం తెలిసిందే. నటుడిగా బాలయ్య గురించి అందరికి తెలుసు. కాని హోస్ట్‌గా ఎలా చేస్తాడు అని అందరు ఆలోచనలు చేస్తున్న సమయంలో విధ్వంసం సృష్టించాడు. తన హోస్టింగ్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు. ఇప్పటికే ఈ టాక్ షో నుంచి రెండు సీజన్లు ఆడియన్స్ ముందుకు రాగా.. ఒకదాన్ని మించి మరో సీజన్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక మూడో సీజన్ ఎప్పుడెప్పుడుప్రసారం అవుతుందని అందరు ఎదురు చూస్తున్న సమయంలో మూడో సీజన్ ఒక స్పెషల్ ఎపిసోడ్ తో ఈ దసరాకి మొదలైపోయింది. బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి టీంతో ఆ స్పెషల్ ఎపిసోడ్ సాగింది.
ఇక అన్‌స్టాపబుల్ గెస్ట్‌లలో మొదటి రెండు సీజన్స్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రవితేజ, అల్లు అర్జున్, నాని, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బడా స్టార్స్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరై సందడి చేశారు. మూడో సీజన్ లో ఎలాంటి గెస్ట్ లు రాబోతున్నారంటూ ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో బాలయ్య షోకి బాలీవుడ్ హీరో వచ్చాడు. స్టార్ హీరో రణబీర్ కపూర్ ని అన్‌స్టాపబుల్ షోకి తీసుకు వస్తున్నారు. ఈ విషయాన్ని షో నిర్వాహుకులు ఇప్పటికే తెలియజేయగా, త్వరలోనే ఈ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది.
అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ కోసం ఇప్పటికే రణబీర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో బాలయ్య షోలో రణ్‌బీర్ రచ్చ మాములుగా ఉండదు అంటూ ముచ్చటించుకుంటున్నారు. మరి బాలయ్య ఈ షోలో హిందీలో మాట్లాడి రణ్‌బీర్ తో ఫుల్ హంగామా చేస్తాడా అని అనుకుంటున్నారు.ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటుడు రణబీర్ కపూర్ ఇప్పుడు నటనకు విరామం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…