Unstoppable With NBK : బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ సెట్‌లో ర‌ణ్‌బీర్ క‌పూర్ సంద‌డి..!

November 14, 2023 8:10 PM

Unstoppable With NBK : నంద‌మూరి బాల‌కృష్ణ న‌టుడిగా, హోస్ట్‌గా అద‌ర‌గొడుతున్న విష‌యం తెలిసిందే. న‌టుడిగా బాల‌య్య గురించి అంద‌రికి తెలుసు. కాని హోస్ట్‌గా ఎలా చేస్తాడు అని అంద‌రు ఆలోచ‌నలు చేస్తున్న స‌మ‌యంలో విధ్వంసం సృష్టించాడు. త‌న హోస్టింగ్‌తో విమ‌ర్శ‌కుల నోళ్లు మూయించాడు. ఇప్పటికే ఈ టాక్ షో నుంచి రెండు సీజన్లు ఆడియన్స్ ముందుకు రాగా.. ఒకదాన్ని మించి మరో సీజన్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక మూడో సీజ‌న్ ఎప్పుడెప్పుడుప్ర‌సారం అవుతుంద‌ని అంద‌రు ఎదురు చూస్తున్న స‌మ‌యంలో మూడో సీజన్ ఒక స్పెషల్ ఎపిసోడ్ తో ఈ దసరాకి మొదలైపోయింది. బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి టీంతో ఆ స్పెషల్ ఎపిసోడ్ సాగింది.

ఇక అన్‌స్టాప‌బుల్ గెస్ట్‌ల‌లో మొదటి రెండు సీజన్స్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రవితేజ, అల్లు అర్జున్, నాని, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బడా స్టార్స్ తో పాటు ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు కూడా హాజ‌రై సంద‌డి చేశారు. మూడో సీజన్ లో ఎలాంటి గెస్ట్ లు రాబోతున్నారంటూ ఆడియన్స్ అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో బాల‌య్య షోకి బాలీవుడ్ హీరో వ‌చ్చాడు. స్టార్ హీరో రణబీర్ కపూర్ ని అన్‌స్టాపబుల్ షోకి తీసుకు వస్తున్నారు. ఈ విషయాన్ని షో నిర్వాహుకులు ఇప్పటికే తెలియ‌జేయ‌గా, త్వరలోనే ఈ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది.

Unstoppable With NBK ranbir kapoor came to set
Unstoppable With NBK

అన్‌స్టాప‌బుల్ ఎపిసోడ్ షూటింగ్ కోసం ఇప్ప‌టికే రణబీర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయ‌న శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ కావ‌డంతో బాల‌య్య షోలో ర‌ణ్‌బీర్ ర‌చ్చ మాములుగా ఉండ‌దు అంటూ ముచ్చ‌టించుకుంటున్నారు. మ‌రి బాల‌య్య ఈ షోలో హిందీలో మాట్లాడి ర‌ణ్‌బీర్ తో ఫుల్ హంగామా చేస్తాడా అని అనుకుంటున్నారు.ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటుడు రణబీర్ కపూర్ ఇప్పుడు నటనకు విరామం తీసుకున్నట్టు తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now