Samantha : స‌మంత‌పై ఫిల్మ్ క్రిటిక్ త‌ప్పుడు కామెంట్లు.. వైర‌ల్ అవుతున్న పోస్ట్‌..!

December 22, 2023 3:52 PM

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా మారిన స‌మంత కొద్ది నెల‌ల క్రితం నాగ చైత‌న్య‌కి విడాకులు ఇచ్చింది. ఆ త‌ర్వాత ఆమెకి మ‌యోసైటిస్ వ్యాధి సోకిందని తెలిసి కొద్ది రోజుల పాటు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చింది. మయోసైటిస్ తో బాధపడుతుండటంతో చికిత్స కోసం ఈ నిర్ణయం తీసుకుంది. నిర్మాతల దగ్గర నుంచి తాను తీసుకున్న అడ్వాన్స్ లను కూడా తిరిగిచ్చేసింది. ఆగస్టు 15న అమెరికాలో జరిగిన వేడులకు ముఖ్యఅతిథిగా హాజరైంది. ఆ తర్వాత ఇటలీ.. ఇలా పలు దేశాలు తిరిగొచ్చింది.

సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న స్టార్ బ్యూటీ సమంత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. త‌న‌కి సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ త‌న ఫ్యాన్స్ ని థ్రిల్ చేస్తుంటుంది. ఒక్కోసారి కొన్ని హాట్ పిక్స్ కూడా షేర్ చేస్తూ షాకిస్తుంటుంది. అయితే స‌మంత హాట్ ఫొటో ఒక‌టి ఉమైర్ సందు త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసి షాకింగ్ కామెంట్స్ చేశాడు. స‌మంత గురించి అంత అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసినందుకు స‌మంత అభిమానులు తిట్టిపోస్తున్నారు. సమంత డివోర్స్ తర్వాత లిమిట్స్ క్రాస్ చేస్తోంది. సమంత నాన్ స్టాప్ గా వన్ నైట్ స్టాండ్స్ చేస్తోంది. ఆమె శృంగారం పైనే దృష్టి పెడుతోంది. సినిమాలు చేసే ఆసక్తి కూడా ఆమెకి లేదు అంటూ ఉమైర్ దారుణంగా కామెంట్స్ చేశాడు.

umair sandhu comments on samantha post viral
Samantha

ఉమైర్ ఇలా మాట్లాడ‌డంపై నెటిజ‌న్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలా త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేయోద్దు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఉమైర్ సంధు విష‌యానికి వ‌స్తే.. తరచూ సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన సంచలన ట్వీట్స్ చేస్తూ కొత్త కొత్త వివాదాలకు తెరలేపుతూ ఉంటాడు ఉమైర్ సంధు.తరచూ ఒక సెలబ్రిటీని టార్గెట్ చేస్తూ వారి గురించి నోటికొచ్చిన విధంగా ఏది తోస్తే అది ట్వీట్ చేస్తూ ఉంటాడు.ఇక తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కి గురయ్యే వారిలో ఉమైర్ సంధు పేరు మొదటగా ఉంటుంది ఎటువంటి సందేహం లేదు.సినిమా విడుదల సమయంలో రివ్యూలు ఇస్తూ ఎక్కువగా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now