Tripti Dimri : ఇటీవలి కాలంలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన చిత్రం యానిమల్. ఇందులో రష్మిక కథానాయికగా నటించగా, ఆమె కన్నా ఎక్కువ పేరు సంపాదించుకుంది హాట్ బ్యూటీ తృప్తి డిమ్రీ. ఈ సినిమా తర్వాత అన్ని భాషల నిర్మాత, దర్శకులు ఈ భామపై దృష్టిపెట్టారు. అయితే తృప్తి డిమ్రీ గురించి తెలుగు సినిమా రంగంలో హాట్ హాట్ చర్చ జరుగుతున్నది. గ్లామర్ హీరోయిన్‌ను నటింపజేసేందుకు నిర్మాతలు భారీగా ప్రయత్నిస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఉత్తరాఖండ్ బ్యూటీ యానిమల్‌లో జోయా పాత్రలో హాట్ హాట్‌గా అందాలు ఆరబోసి.. కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. యానిమల్ సక్సెస్‌తో తృప్తి డిమ్రి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ఓ రేంజ్‌లో పెరిగిపోయిందంటే అతిశయోక్తి కాదు.
ఇప్పుడిప్పుడే మంచి సినిమా అవకాశాలని అందుకుంటున్న తృప్తి డిమ్రీ తాజాగా ఓ బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్‍లో ఎంతో పాపులర్ అయిన ఆషికీ ఫ్రాంచైజీలో తదుపరి రానున్న ఆషికీ 3 మూవీలో హీరోయిన్‍గా తృప్తి డిమ్రికి ఆఫర్ దక్కిందనే టాక్ నడుస్తుంది. ఆషికీ 3 చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా చేస్తుండగా, కార్తీక్ సరసన తృప్తి డిమ్రి హీరోయిన్‍గా నటించనున్నారని సమాచారం. కొన్ని రోజుల చర్చ తర్వాత ఎట్టకేలకు హీరోయిన్‍గా తృప్తి డిమ్రిని ఫిక్స్ చేసినట్టు ఆ మూవీ వర్గాల నుంచి సమాచారం బయటికి వచ్చింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇదే నిజమైతే అమ్మడి లక్ మాములుగా ఉండదు.
తృప్తి డిమ్రీకి పలు బాలీవుడ్ సినిమాలలో నటించిన రాని గుర్తింపు యానిమల్ సినిమా ద్వారా వచ్చింది. ఈ సినిమాలో ఈమె కాస్త బోల్డ్ సన్నివేశాలలో నటించడంతో రాత్రికి రాత్రే స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాలో తృప్తి జోయా పాత్రలో నటించారు. ఇటీవల ఐఎండీబీ రిలీజ్ చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్ లో తృప్తి టాప్ లో ఉండటం విశేషం.ఉత్తరాఖండ్‌లో 1997 సంవత్సరంలో ఫిబ్రవరి 23వ తేదీన జన్మించారు. 2017లో బాబీ డియోల్, బాబీ డియోల్, శ్రేయాస్ తల్పాడే నటించిన పోస్టర్ బాయ్స్ చిత్రంలో నటిచడం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించింది. అదే సంవత్సరం శ్రీదేవీ నటించిన మామ్ అనే చిత్రంలో కూడా నటించి మెప్పించింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…