Tripti Dimri : యానిమ‌ల్ బ్యూటీకి అదిరిపోయే ఆఫ‌ర్.. ఏ సినిమాలో అంటే..!

December 27, 2023 7:50 PM

Tripti Dimri : ఇటీవ‌లి కాలంలో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టిన చిత్రం యానిమ‌ల్. ఇందులో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టించ‌గా, ఆమె క‌న్నా ఎక్కువ పేరు సంపాదించుకుంది హాట్ బ్యూటీ తృప్తి డిమ్రీ. ఈ సినిమా త‌ర్వాత అన్ని భాషల నిర్మాత, దర్శకులు ఈ భామపై దృష్టిపెట్టారు. అయితే తృప్తి డిమ్రీ గురించి తెలుగు సినిమా రంగంలో హాట్ హాట్ చర్చ జరుగుతున్నది. గ్లామర్ హీరోయిన్‌ను నటింపజేసేందుకు నిర్మాతలు భారీగా ప్రయత్నిస్తున్నట్టు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఉత్తరాఖండ్‌ బ్యూటీ యానిమల్‌లో జోయా పాత్రలో హాట్‌ హాట్‌గా అందాలు ఆరబోసి.. కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. యానిమల్‌ సక్సెస్‌తో తృప్తి డిమ్రి ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య ఓ రేంజ్‌లో పెరిగిపోయిందంటే అతిశ‌యోక్తి కాదు.

ఇప్పుడిప్పుడే మంచి సినిమా అవ‌కాశాల‌ని అందుకుంటున్న తృప్తి డిమ్రీ తాజాగా ఓ బంపర్ ఆఫర్ దక్కించుకున్న‌ట్టు తెలుస్తోంది. బాలీవుడ్‍‍లో ఎంతో పాపులర్ అయిన ఆషికీ ఫ్రాంచైజీలో తదుపరి రానున్న ఆషికీ 3 మూవీలో హీరోయిన్‍గా తృప్తి డిమ్రికి ఆఫ‌ర్ దక్కింద‌నే టాక్ న‌డుస్తుంది. ఆషికీ 3 చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా చేస్తుండ‌గా, కార్తీక్ సరసన తృప్తి డిమ్రి హీరోయిన్‍గా నటించనున్నారని సమాచారం. కొన్ని రోజుల చర్చ తర్వాత ఎట్టకేలకు హీరోయిన్‍గా తృప్తి డిమ్రిని ఫిక్స్ చేసినట్టు ఆ మూవీ వర్గాల నుంచి సమాచారం బయటికి వచ్చింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇదే నిజ‌మైతే అమ్మ‌డి ల‌క్ మాములుగా ఉండ‌దు.

Tripti Dimri reportedly got bumper offer for a movie
Tripti Dimri

తృప్తి డిమ్రీకి పలు బాలీవుడ్ సినిమాలలో నటించిన రాని గుర్తింపు యానిమల్ సినిమా ద్వారా వచ్చింది. ఈ సినిమాలో ఈమె కాస్త బోల్డ్ సన్నివేశాలలో నటించడంతో రాత్రికి రాత్రే స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాలో తృప్తి జోయా పాత్రలో నటించారు. ఇటీవల ఐఎండీబీ రిలీజ్ చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్ లో తృప్తి టాప్ లో ఉండటం విశేషం.ఉత్తరాఖండ్‌లో 1997 సంవత్సరంలో ఫిబ్రవరి 23వ తేదీన జన్మించారు. 2017లో బాబీ డియోల్, బాబీ డియోల్, శ్రేయాస్ తల్పాడే నటించిన పోస్టర్ బాయ్స్ చిత్రంలో నటిచడం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించింది. అదే సంవత్సరం శ్రీదేవీ నటించిన మామ్ అనే చిత్రంలో కూడా నటించి మెప్పించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now