Tiger Nageswara Rao OTT : స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు.. మ‌రీ ఇంత స‌ర్‌ప్రైజా..!

November 17, 2023 5:17 PM

Tiger Nageswara Rao OTT : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్యూర్ మాస్ ఇమేజ్‌తో సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచే హీరోల‌లో ర‌వితేజ ఒక‌రు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు ఇటీవ‌లి కాలంలో చేస్తున్న ర‌వితేజ ధ‌మాకాతో మంచి హిట్ అందుకున్నాడు. ‘ధమాకా’తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన తర్వాత ‘రావణాసుర’తో డిజాస్టర్ చవి చూశాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ఇటీవలే రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే పాన్ ఇండియా సినిమాలో నటించాడు.ద‌స‌రా పండుగ స‌మ‌యంలో పాన్ ఇండియాగా విడుద‌లైన ర‌వితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమా చ‌డీ చ‌ప్పుడు లేకుండా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. అక్టోబ‌ర్ 20న భ‌గ‌వంత్ సింగ్ కేస‌రి, లియో వంటి సినిమాల‌తో పోటీగా థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా మొద‌టి ఆట నుంచే మిశ్ర‌మ స్పంద‌న తెచ్చుకుంది.

విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుక‌ని మంచి చిత్రంగా పేరు తెచ్చుకున్న‌ప్ప‌టికీ మిగ‌తా చిత్రాల స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేక‌పోయింది. రవితేజ హీరోగా వంశీ అనే డైరెక్టర్ తెరకెక్కించిన సినిమానే ‘టైగర్ నాగేశ్వరరావు కాగా 1970 కాలంలో గజగజలాడించిన స్టువర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఫలితంగా ఈ మూవీ నష్టాలతోనే రన్‌ను ముగించాల్సి వచ్చింది.

Tiger Nageswara Rao OTT now streaming where to watch
Tiger Nageswara Rao OTT

చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ఫేమస్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇందులో సదరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు తెలిసింది. ఇది రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్ అని ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది. ఎలాంటి ముంద‌స్తు ప్ర‌చారం లేకుండా సెలైంట్‌గా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావును ఓటీటీలో రిలీజ్ చేశారు. శుక్ర‌వారం నుండి తెలుగుతో పాటు త‌మిళం,మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉన్న‌ట్లు అమెజాన్ ప్రైమ్ ప్ర‌క‌టించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now