The Vaccine War OTT Release : సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన ది వ్యాక్సిన్ వార్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..

November 25, 2023 11:22 AM

The Vaccine War OTT Release : ఇటీవ‌ల సినీ ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా ఓటీటీ కంటెంట్‌పై దృష్టి పెడుతున్నారు. ప్ర‌తి వారం ఓటీటీలో ఏయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు వ‌స్తున్నాయ‌ని గ‌మనిస్తున్నారు. ఈ క్ర‌మంలో సైలెంట్‌గా వ‌చ్చిన ది వ్యాక్సిన్ వార్ మూవీ చూసేందుకు చూపుతున్నారు. ‘ది కశ్మీర్​ ఫైల్స్​’ సినిమాతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన బాలీవుడ్​ స్టార్​ డైరెక్టర్​ వివేక్ అగ్నిహోత్రి తెర‌కెక్కించిన తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్​ వార్’. బాలీవుడ్​ హీరో నానా పాటేకర్​, ‘ది కశ్మీర్ ఫైల్స్’​ ఫేమ్​ నటి పల్లవి జోషి, సీనియర్ స్టార్​ అనుపమ్ ఖేర్​, ‘కాంతార’ హీరోయిన్​ సప్తమి గౌడ​ త‌దిత‌రులు ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

సెప్టెంబ‌ర్ 28న ఈ చిత్రాన్ని సుమారు 11 భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వ‌చ్చారు. అయితే రావ‌డం రావడమే బీజేపీ ప్రాపగాండా మూవీ అంటూ ఈ సినిమాకు టాక్ రావడంతో బాక్సాఫీస్ వ‌ద్ద అట్ట‌ర్ ప్లాప్‌గా నిలిచింది. కాశ్మీర్‌ ఫైల్స్‌ తరహాలో జనాలను ఆకట్టుకోలేకపోయింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో రిలీజైనా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ది వ్యాక్సిన్‌ వార్‌ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ది వ్యాక్సిన్‌ వార్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను కొనుగోలు చేయ‌గా, ఇది శుక్రవారం (నవంబర్‌ 24) నుంచి ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌ సంస్థ.

The Vaccine War OTT Release streaming details
The Vaccine War OTT Release

ప్రస్తుతం ఈ సినిమా హిందీలో మాత్రమే స్ట్రీమింగ్‍కు వచ్చింది. కానీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల ఆడియో ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ చిత్రం కథ విష‌యానికి వస్తే..కొవిడ్-19కు భారతీయ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొనడం గురించి ఈ మూవీ తెరకెక్కించారు. వ్యాక్సిన్ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎంత తపన పడ్డారో, ఎన్ని సవాళ్లను ఎదుర్కొన్నారో ఈ చిత్రంలో చూపించారు డైరెక్టర్. వ్యాక్సిన్‍ను అభివృద్ధి చేయడం నుంచి చాలా విషయాలను తెలుసుకొని మూవీని ఇంట్రెస్టింగ్‌గా రూపొందించారు.కాని జ‌నాల‌ని అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now