Tamannaah : టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన తమన్నా చేయని ప్రయోగం లేదు. కథానాయికగా నటించి అలానే ఐటెం సాంగ్స్ చేసింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసింది.ఈ క్రమంలో తమన్నా హీరోయిన్‌గా నటించిన లేడీ ఓరియెంటెడ్ తెలుగు మూవీ దటీజ్ మహాలక్ష్మి మూవీ 2020లోనే షూటింగ్ పూర్తయిన ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ క్వీన్ సీక్వెల్‌గా దటీజ్ మహాలక్ష్మిని రూపొందించారు. 2014లో ఈ సినిమాను షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 2016లో ఈ సినిమా షూటింగ్ పూర్తయిన ఇప్పటివరకు సినిమాను రిలీజ్ చేయలేదు.
హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించగా, మూవీకి సంబంధించిన కాపీ రైట్ప్ విషయంలో పలు వివాదాలు ఏర్పడగా, ఆ వివాదాల కారణంగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. ఇక షూటింగ్ అయిన తరువాత రిలీజ్‌కు ఇంత గ్యాప్ రావడంతో దర్శకుడు, హీరోయిన్ తో పాటు ప్రేక్షకులు కూడా ఆ సినిమా గురించి మర్చిపోయారు. ప్రస్తుతం ఓటీటీలో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ చేయాలని మేకర్ సన్నాహాలు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ మూవీని ఓటీటీలోకి తీసుకు రావాలని అనుకుంటున్నారట.
ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌తో నిర్మాతలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. త్వరలోనే దట్ ఇజ్ మహాలక్ష్మి ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లియరెన్స్ కూడా రానుంది. ఈ మూవీలో సిద్దు జొన్నలగడ్డ కీరోల్ ప్లే చేశాడు. మరి చాలా లేట్‌గా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు తమన్నాకి అవకాశాలు సన్నగిల్లాయి. అడపాదడపా ఏదో అలా మెరుస్తూ వెళుతుంది. చూస్తుంటే తమన్నా త్వరలో పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పీకల్లోతు ప్రేమలో ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…