Sushmita Konidela : మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఆయన కూతురు సుస్మిత కూడా ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చింది. కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. చిరంజీవి మూవీ ఖైదీ నెం.150 సినిమాకు కూడా ఆమె పనిచేసింది. సైరా నరసింహారెడ్డి సినిమాకు కూడా ఆమె వర్క్ చేశారు. అదే విధంగా ఆమె రామ్ చరణ్ తేజ్ రంగస్థలం సినిమాకు కూడా వర్క్ చేయడం జరిగింది. నిర్మాతగానూ అదరగొడుతున్నారు. యువ హీరో సంతోష్ శోభన్ తో కలిసి ఒక సినిమాను నిర్మించారు.
గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ ‘శ్రీదేవి శోభన్‌బాబు’అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నారు. దీనిపై సుస్మిత చాలా అంచనాలే పెట్టుకుంది. అయితే ఇంతకముందు సుస్మిత సేనాపతి (ఆహా) మరియు షూటౌట్ ఎట్ అలైర్ (జీ5) వంటి ఓటీటీ కంటెంట్‌ని నిర్మించింది. రెండు ప్రాజెక్ట్‌లు పెద్దగా ప్రభావం చూపలేదు. ఆమె బ్యానర్ నుండి మంచి హిట్ తీసుకొచ్చేందుకు తపన పడుతుంది.
సుస్మిత మెగా ఇమేజ్ నుండి బయటకు వచ్చి సొంతంగా తమ టాలెంట్ నిరూపించుకోవాలని అంటుకుంటుంది. ఇప్పటి వరకు సక్సెస్ ఆమెకు దూరంగానే ఉంది, అయితే ఆమె మంచి విజయం సాధించాలని మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఆరాటపడుతున్నారు. కాగా, సుస్మిత ఇటీవల శ్రీదేవి శోభన్‌బాబు సినిమా గురించి మాట్లాడుతూ.. నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా. సంతోష్, ప్రశాంత్‌ని అనుకోకుండా ఓ కాఫీ షాప్‌లో కలిశాను. అలా స్టార్ట్ అయిన మా ప్రయాణం ఇక్కడి వరకు వచ్చింది అన్నారు. చిన్న ఆలోచనతో ప్రారంభమైన ఈ సినిమా కోసం అందరం మనసు పెట్టి పని చేశాం. మా అందరిలోని ఇన్నోసెంట్ ఎమోషన్స్ అన్నీ స్క్రిప్ట్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యింది అని పేర్కొంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…