Sushmita Konidela : చిరంజీవి కుమార్తెకు అదృష్టం క‌ల‌సి రావ‌డం లేదా..? బ్యాడ్ ల‌క్ అంటే ఇదే..?

February 9, 2023 7:27 PM

Sushmita Konidela : మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌ల వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఆయ‌న కూతురు సుస్మిత కూడా ఇండ‌స్ట్రీలో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు వ‌చ్చింది. కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. చిరంజీవి మూవీ ఖైదీ నెం.150 సినిమాకు కూడా ఆమె పనిచేసింది. సైరా నరసింహారెడ్డి సినిమాకు కూడా ఆమె వర్క్ చేశారు. అదే విధంగా ఆమె రామ్ చరణ్ తేజ్ రంగస్థలం సినిమాకు కూడా వర్క్ చేయడం జరిగింది. నిర్మాతగానూ అదరగొడుతున్నారు. యువ హీరో సంతోష్ శోభన్ తో కలిసి ఒక సినిమాను నిర్మించారు.

గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ హీరో హీరోయిన్లుగా ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో సుస్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్ ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 18న విడుద‌ల చేస్తున్నారు. దీనిపై సుస్మిత చాలా అంచ‌నాలే పెట్టుకుంది. అయితే ఇంత‌క‌ముందు సుస్మిత‌ సేనాపతి (ఆహా) మరియు షూటౌట్ ఎట్ అలైర్ (జీ5) వంటి ఓటీటీ కంటెంట్‌ని నిర్మించింది. రెండు ప్రాజెక్ట్‌లు పెద్దగా ప్రభావం చూపలేదు. ఆమె బ్యాన‌ర్ నుండి మంచి హిట్ తీసుకొచ్చేందుకు త‌ప‌న ప‌డుతుంది.

Sushmita Konidela career going down luck is in not her favor
Sushmita Konidela

సుస్మిత మెగా ఇమేజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి సొంతంగా త‌మ టాలెంట్ నిరూపించుకోవాల‌ని అంటుకుంటుంది. ఇప్పటి వరకు సక్సెస్ ఆమెకు దూరంగానే ఉంది, అయితే ఆమె మంచి విజ‌యం సాధించాల‌ని మెగా ఫ్యాన్స్ ఎంత‌గానో ఆరాట‌ప‌డుతున్నారు. కాగా, సుస్మిత ఇటీవ‌ల శ్రీదేవి శోభ‌న్‌బాబు సినిమా గురించి మాట్లాడుతూ.. నా మనసుకు ఎంతో ద‌గ్గ‌రైన సినిమా. సంతోష్‌, ప్ర‌శాంత్‌ని అనుకోకుండా ఓ కాఫీ షాప్‌లో క‌లిశాను. అలా స్టార్ట్ అయిన మా ప్ర‌యాణం ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చింది అన్నారు. చిన్న ఆలోచ‌న‌తో ప్రారంభ‌మైన ఈ సినిమా కోసం అంద‌రం మ‌న‌సు పెట్టి ప‌ని చేశాం. మా అంద‌రిలోని ఇన్నోసెంట్ ఎమోష‌న్స్ అన్నీ స్క్రిప్ట్‌కి ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యింది అని పేర్కొంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now