Sreemukhi : వామ్మో.. శ్రీముఖి క్రేజ్ మాములుగా లేదుగా.. ఇటీవ‌లి కాలంలో భామ హ‌వా చూశారా..

December 9, 2023 4:01 PM

Sreemukhi : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ యాంక‌ర్స్‌లో శ్రీముఖి ఒకరు. యాంకర్స్ కూడా ఇంత గ్లామర్‌గా కనిపిస్తారని శ్రీముఖిని చూస్తే అర్థం అవుతుంది. తనదైన యాంకరింగ్‌తో చాలామంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ త‌న సొగ‌సైన అందంతో క‌ట్టిప‌డేస్తుంది. సొగసైన అందచందాలతో మైమరిపిస్తోంది శ్రీముఖి. రోజు రోజుకు గ్లామర్ డోస్ మరింత పెంచేస్తూ కుర్రాళ్లను తెగ అట్రాక్ట్ చేస్తోంది. బాగా బోద్దుగా ఉండే ముద్దుగుమ్మ నాజూగ్గా తయారైయ్యేందుకు తెగ కసరత్తు చేస్తోంది. ఓ వైపు తన యాంకరింగ్‌తో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ మరోవైపు సినిమాల్లోనూ ఆఫర్స్‌ను సొంతం చేసుకుంటూ తన నటనతో మెప్పిస్తోంది. ఫోటో షూట్‌తో వయ్యరాలు ఒలకబోస్తూ హీటెక్కిస్తోంది.

ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెరపై ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’, ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ సీజన్ 2’షోలతో సందడి చేస్తోంది. మ‌రోవైపు ఈ భామ సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తూ క‌నిపిస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు డిఫ‌రెంట్ పోస్ట్‌లు పెడుతూ రచ్చ చేస్తుంది. రీసెంట్ గా థాయిలాండ్ వెకేషన్ కు సంబంధించిన వీడియోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ఆసక్తికరంగా మారింది. బీచ్ వేర్ లో వాతావరణాన్ని ఎంజాయి చేస్తున్న శ్రీముఖికి ఒక్కసారిగా భయపడే వాతావరణం ఏర్పడింది.బీచ్ ఒడ్డున నిల్చుని సముద్రపు అలను వీక్షిస్తూ వీడియోకు స్టిల్స్ ఇచ్చింది. అదే సమయంలో ఉవ్వెత్తున వచ్చిన అల శ్రీముఖిని ఒడ్డుకు నెట్టేసింది. దీంతో భయపడిపోయింది. చివర్లో అలా జరగడంపై అభిమానులతో పంచుకుంది.

Sreemukhi getting lot of offers she is busy
Sreemukhi

శ్రీముఖి హ‌వా ఇప్పుడు పీక్స్‌లో ఉంది. ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు షోస్, ఇంకో వైపు సోష‌ల్ మీడియాలో సంద‌డి. ఇలా ఈ అమ్మ‌డు మాత్రం తెగ సంద‌డి చేస్తూ ప్రేక్ష‌కుల‌ని, అభిమానుల‌ని తెగ అల‌రిస్తుంది. శ్రీముఖికి ఇటీవ‌లి కాలంలో క్రేజ్ పీక్స్‌కి చేర‌గా, ఆమె హంగామా ఓ రేంజ్‌లో ఉంది. శ్రీముఖి హ‌వాని చూసి తోటి యాంక‌ర్స్ సైతం షాక‌వుతున్నారు. ఇప్పుడు ఎక్క‌డ చూసిన‌, ఎవ‌రి నోట విన్నా కూడా ఈ అమ్మ‌డి గురించే చ‌ర్చ జ‌ర‌గుతుండ‌గా, ప్ర‌తి ఒక్క‌రు స్ట‌న్ అవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now