Sara Tendulkar : టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్, సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్ కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నట్టు ప్రచారాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఊతమిచ్చేలా శుభ్‌మన్, సారా కలిసి దిగిన ఫొటోలు పలుమార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే శుభ్‌మన్ ఆడిన ప్రతి మ్యాచ్‌లో సారా టెండూల్కర్ కనిపించడం కూడా ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చిందనే చెప్పాలి. గిల్ అద్భుతంగా ఆడుతున్నప్పుడల్లా సారా కళ్లలో ఆనందం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అయితే సారా ఇప్పుడు శుభ్‌మన్ గిల్‌కి హ్యాండ్ ఇచ్చి రామ్ చరణ్ తో రొమాన్స్ చేయబోతున్నట్టు ప్రచారం అవుతుంది.
సచిన్ కుమార్తె, మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ కలిసి సినిమా దాదాపు ఖరారైందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ దక్కించుకున్న చరణ్ వరుస చిత్రాలకి కమిట్ అవుతున్నాడు. చరణ్.. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ చిత్రం ఉండనుందని ఇప్పటికే అనౌన్స్ చేసారు. ఇందులో చెర్రీ సరసన సారా టెండూల్కర్ ను నటింపజేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారట. మరి, బుచ్చిబాబు ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాలి.
మొన్నటి వరకూ.. బుచ్చిబాబు తెరకెక్కుతున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతోంది అని టాక్ గట్టిగా నడిచింది. దాదాపు సాయి పల్లవి ఫిక్స్ అయ్యింది అన్నారు. కాని ఇప్పుడు ఆమె స్థానంలో సారా టెండూల్కర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు రామ్ చరణ్ బాలీవుడ్ లో కూడా రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో ఒక సినిమా చేయటం ఖరారు కాగా, ఆ సినిమా కోసం ఒక కొత్త హీరోయిన్ ని పరిచయం చేయాలని భావిస్తున్నారట మూవీ యూనిట్. అందులో భాగంగా ఇప్పటికే పలు యాడ్స్..డిజైనింగ్ లో బిజీగా ఉన్న సారాను వెండితెరకు పరిచయం చేయటానికి ముహూర్తం ఫిక్స్ అయిందని ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…