Sara Tendulkar : రామ్‌చ‌ర‌ణ్ మూవీలో స‌చిన్ కుమార్తె..? త‌్వ‌ర‌లో అనౌన్స్‌మెంట్‌..?

November 22, 2023 5:36 PM

Sara Tendulkar : టీమిండియా ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌, స‌చిన్ టెండూల్క‌ర్ త‌న‌య సారా టెండూల్క‌ర్ కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న‌ట్టు ప్ర‌చారాలు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ వార్తలకు ఊతమిచ్చేలా శుభ్‌మ‌న్, సారా క‌లిసి దిగిన ఫొటోలు ప‌లుమార్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అలాగే శుభ్‌మ‌న్ ఆడిన ప్రతి మ్యాచ్‌‌లో సారా టెండూల్క‌ర్ క‌నిపించ‌డం కూడా ఈ పుకార్ల‌కు మరింత బ‌లాన్ని చేకూర్చిందనే చెప్పాలి. గిల్ అద్భుతంగా ఆడుతున్న‌ప్పుడల్లా సారా క‌ళ్ల‌లో ఆనందం కొట్టొచ్చిన‌ట్టు క‌న‌ప‌డుతుంది. అయితే సారా ఇప్పుడు శుభ్‌మ‌న్ గిల్‌కి హ్యాండ్ ఇచ్చి రామ్ చ‌ర‌ణ్ తో రొమాన్స్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం అవుతుంది.

సచిన్ కుమార్తె, మెగాస్టార్ వారసుడు రామ్ చ‌ర‌ణ్‌ కలిసి సినిమా దాదాపు ఖరారైందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ద‌క్కించుకున్న చ‌ర‌ణ్ వ‌రుస చిత్రాల‌కి క‌మిట్ అవుతున్నాడు. చరణ్.. ప్ర‌స్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ చిత్రం ఉండనుందని ఇప్పటికే అనౌన్స్ చేసారు. ఇందులో చెర్రీ సరసన సారా టెండూల్కర్ ను నటింపజేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారట. మరి, బుచ్చిబాబు ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

Sara Tendulkar may be acting in ram charan movie
Sara Tendulkar

మొన్నటి వరకూ.. బుచ్చిబాబు తెర‌కెక్కుతున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతోంది అని టాక్ గట్టిగా నడిచింది. దాదాపు సాయి పల్లవి ఫిక్స్ అయ్యింది అన్నారు. కాని ఇప్పుడు ఆమె స్థానంలో సారా టెండూల్క‌ర్ వ‌చ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రోవైపు రామ్ చరణ్ బాలీవుడ్ లో కూడా రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో ఒక సినిమా చేయటం ఖరారు కాగా, ఆ సినిమా కోసం ఒక కొత్త హీరోయిన్ ని పరిచయం చేయాలని భావిస్తున్నారట మూవీ యూనిట్. అందులో భాగంగా ఇప్పటికే పలు యాడ్స్..డిజైనింగ్ లో బిజీగా ఉన్న సారాను వెండితెరకు పరిచయం చేయటానికి ముహూర్తం ఫిక్స్ అయిందని ప్రచారం సాగుతోంది. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now