Vijay Devarakonda : విజయ్ దేవరకొండకు స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ వచ్చింది. తనదైన స్టైల్‌లో మాట్లాడుతూ అభిమానులని ఎంటర్‌టైన్ చేస్తూ ఉండే విజయ్ దేవరకొండ సినిమాలలోనూ డిఫరెంట్ ఆటిట్యూడ్ చూపిస్తూ అందరి మన్ననలు పొందుతూ ఉంటాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇందులో అనన్య పాండే విజయ్ సరసన జోడీ కట్టింది.
విజయ్ దేవరకొండతో నటించాలని యంగ్ భామలకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఇప్పటికే చాలా మంది ఓపెన్ అయి ఆయనతో నటించాలని ఉందని అన్నారు. తాజాగా సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ విజయ్ దేవరకొండతో నటించాలని ఉందని ఓపెన్ అయ్యింది. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా ఈ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె ‘అత్రాంగి రే’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీలో అక్షయ్ కుమార్, ధనుష్ హీరోలుగా నటిస్తున్నారు.
ధనుష్ కి జంటగా సారా అలీఖాన్ కనిపించనుంది. ధనుష్ తో నటించడం గొప్ప అనుభూతి అని చెప్పిన సారా అలీ ఖాన్ ని.. ధనుష్ కాకుండా మీరు నటించాలని కోరుకుంటున్న సౌత్ స్టార్ ఎవరని అడగగా.. ఠక్కున విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. ఆయన గ్రేట్ యాక్టర్. సూపర్ కూల్ . అలాగే సో హాట్.. అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. సారా అలీ ఖాన్ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. మరి రానున్న రోజులలో సారా అలీ ఖాన్.. విజయ్‌కి జోడీగా నటిస్తుందా.. లేదా.. అనేది చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…