Samantha : శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లీడర్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన రానా ఆనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం హీరోగానే కాదు విలన్‌గానూ సందడి చేస్తున్నారు. అప్పుడప్పుడు హోస్ట్‌గాను అలరిస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి సినిమా చేస్తున్నాడు రానా. పవన్ -రానా కలిసి నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
వేణు ఉడుగుల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. విరాటపర్వం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా నక్సలైట్ గా కనిపించనున్నాడు. ఇక నేడు రానా పుట్టిన రోజు సందర్భంగా సినిమాతారలు, అభిమానులు రానా కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రానా బాబాయ్, విక్టరీ వెంకటేష్, బండ్ల గణేష్, దర్శకుడు బాబీ, హీరోయిన్ అనుష్క శెట్టి, సురేష్ ప్రొడక్షన్స్.. రానాకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు.
ఇక నాగ చైతన్యకు బర్త్ డే విషెస్ తెలపని సమంత రానాకు మాత్రం బెస్ట్ విషెస్ అందించింది. హ్యాపీ బర్త్‌డే రానా. నీకు ఎప్పుడూ మంచే జరగాలని కోరుకుంటున్నా. శక్తివంతమైన, పెద్ద మనసు ఉన్నవాడివి నువ్వు. దేవుడికి ఇష్టమైనవాడివి’ అంటూ సమంత తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీనిపై స్పందించిన రానా.. ‘థ్యాంక్యూ సో మచ్ రూత్’ అంటూ కామెంట్ చేశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…