Samantha: మనసు ఉన్నవాడివి, దేవుడికి ఇష్టమైనవాడివి.. రానాపై స‌మంత ప్ర‌శంస‌ల జ‌ల్లు

December 17, 2021 10:34 AM

Samantha : శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన లీడ‌ర్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన రానా ఆనతి కాలంలోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవ‌లం హీరోగానే కాదు విల‌న్‌గానూ సంద‌డి చేస్తున్నారు. అప్పుడ‌ప్పుడు హోస్ట్‌గాను అల‌రిస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి సినిమా చేస్తున్నాడు రానా. పవన్ -రానా కలిసి నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Samantha told birth day wishes to rana

వేణు ఉడుగుల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. విరాటపర్వం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా నక్సలైట్ గా కనిపించనున్నాడు. ఇక నేడు రానా పుట్టిన రోజు సందర్భంగా సినిమాతారలు, అభిమానులు రానా కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రానా బాబాయ్, విక్టరీ వెంకటేష్, బండ్ల గణేష్, దర్శకుడు బాబీ, హీరోయిన్ అనుష్క శెట్టి, సురేష్ ప్రొడక్షన్స్.. రానాకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియ‌జేశారు.

ఇక నాగ చైతన్యకు బ‌ర్త్ డే విషెస్ తెల‌ప‌ని స‌మంత రానాకు మాత్రం బెస్ట్ విషెస్ అందించింది. హ్యాపీ బర్త్‌డే రానా. నీకు ఎప్పుడూ మంచే జరగాలని కోరుకుంటున్నా. శక్తివంతమైన, పెద్ద మనసు ఉన్నవాడివి నువ్వు. దేవుడికి ఇష్టమైనవాడివి’ అంటూ సమంత తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీనిపై స్పందించిన రానా.. ‘థ్యాంక్యూ సో మచ్‌ రూత్‌’ అంటూ కామెంట్‌ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now