Samantha : స‌మంత ఏంటి మ‌రీ ఇంత బోల్డ్‌నెస్సా.. యువత ఏమై పోవాలి..!

December 11, 2023 11:46 AM

Samantha : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్లో అండ్ స్ట‌డీగా కెరీర్‌ని కొన‌సాగించిన వాళ్లు కొంద‌రే ఉన్నారు. వారిలో స‌మంత ఒక‌రు. ఎన్ని ఎత్తు ప‌ల్లాలు ఎదురైన కూడా స‌మంత మాత్రం స్టార్ హీరోయిన్‌గానే కొన‌సాగుతుంది. ఎన్నో భాషల్లో వరుసగా సినిమాలు చేసిన ఈ సుందరాంగి.. ఈ మధ్య కాలంలో మాత్రం స్పీడ్ తగ్గించేసిన విషయం తెలిసిందే. మ‌యోసైటిస్ బారిన ప‌డిన త‌ర్వాత స‌మంత ఏకంగా ఏడాది పాటు రెస్ట్ తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఖుషి చిత్రం త‌ర్వాత స‌మంత ఎలాంటి ప్రాజెక్ట్స్‌కి సైన్ చేయ‌లేదు. గత ఏడాది వచ్చిన ‘యశోద’తో బిగ్గెస్ట్ సోలో హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ ఉత్సాహంతో మరిన్ని ప్రాజెక్టులు చేసింది. అయితే, ఈ ఏడాది ఆమె నటించిన ‘శాకుంతలం’, ‘ఖుషి’ మూవీలు చేసింది. కానీ, ఈ రెండూ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాలనే చవి చూసేశాయి.

స‌మంత న‌టించిన ‘సీటాడెల్’ వెబ్ సిరీస్ మరికొద్ది రోజుల్లో స్ట్రీమింగ్‌కు రాబోతుంది. దీని కోసం ఆమె అభిమానులు అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.అయితే దాదాపు దశాబ్దానికి పైగానే పదుల సంఖ్యలో సినిమాలు చేసిన సమంత రూత్ ప్రభు.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. విడాకుల త‌ర్వాత సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలను వదులుతోంది. ఇటీవలి కాలంలో అయితే వరుసగా ఫొటోషూట్లు చేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. స‌మంత ఫొటోల‌ని చూసి కుర్ర‌కారు కూడా షాక్ అవుతున్నారు.

Samantha attended tv show photos viral
Samantha

తాజాగా స‌మంత డెనిమ్ జీన్స్‌లో రెచ్చిపోయింది. డీప్ నెక్‌తో డిజైన్ చేసిన టాప్ వేసుకుని విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో సమంత రూత్ ప్రభు మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.ఇంత బోల్డ్‌గా స‌మంత క‌నిపించ‌డంపై ప్ర‌తి ఒక్కరు షాక్ అవుతున్నారు. కొంద‌రు స‌మంత ఫొటోల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తుంటే మ‌రి కొంద‌రు ఎప్ప‌టి మాదిరిగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు సెలెబ్రిటీలు, అభిమానులు ఆమె అందాలను విపరీతంగా పొగడుతూ సపోర్టుగా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే హాలీవుడ్‌లో ప్రియాంకా చోప్రా న‌టించిన‌ సిటాడెల్‌కు రిమేక్‌గా వ‌స్తున్న ఈ సిరీస్‌ను మ‌న దేశానికి అనుగుణంగా మార్పులు చేసిన వెబ్ సిరీస్‌ను 2024 వేస‌విలో ఏఫ్రిల్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఇందులో వ‌రుణ్ దావ‌న్, సమంత ర‌చ్చ చేసిన‌ట్టు తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now