కొన్నిసార్లు హీరోలు రిజెక్ట్ చేసిన కథలు రికార్డులను క్రియేట్ చేస్తాయి. ఆ తరువాత ఆ సినిమాను ఎందుకు మిస్ చేసుకున్నామా అని బాధపడుతుంటారు. అలా మెగాస్టార్ కూడా తన కెరీర్ లో చాలా సినిమాలను మిస్ అయ్యారు. అంతే కాకుండా చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో రజినీకాంత్ రికార్డులు క్రియేట్ చేశాడు. ఆ సినిమా ఏంటి..? అసలు చిరంజీవి అంతమంచి కథను ఎలా.. ఎందుకు.. రిజెక్ట్ చేశాడు.. అన్న సంగతి ఇప్పుడు చూద్దాం.
మళయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి ప్రధాన పాత్రలో నటించిన మళయాళ చిత్రం మణిచిత్ర తాల్. ఈ సినిమాలో శోభన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 1993లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు రీమేక్ గా 2004 లో కన్నడలో ఆప్తమిత్ర అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో సౌందర్య హీరోయిన్ గా నటించింది. సినిమాలో విష్ణువర్థన్ హీరోగా నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.
ఇదిలా ఉండగా ఇదే సినిమాను తమిళ్ లో రజినీకాంత్ హీరోగా చంద్రముఖి అనే టైటిల్ ల్ తో తెరకెక్కించారు. అంతే కాకుండా ప్రభు ముఖ్యపాత్రలో నటించాడు. ఈ సినిమాలో జ్యోతిక, నయనతారలు హీరోయిన్ లు గా నటించారు. ఈ సినిమాకు మొదట నాగవల్లి అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ రజినీకాంత్ చంద్రముఖి అనే టైటిల్ ను సూచించడంతో అదే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 2005లో వచ్చిన ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేసింది. ప్రేక్షకులు థియేటర్ లో జ్యోతిక నటనకు వణికిపోయారు.
ఇదే సినిమాను తెలుగులో కూడా డబ్ చేయగా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. అయితే నిజానికి దర్శకుడు వీఎన్ ఆదిత్య ఆప్తమిత్ర సినిమా చూడాలని చిరంజీవికి ముందుగానే సీడీని పంపించాడు. ఆ సినిమా చూసిన చిరు రిజెక్ట్ చేశాడు. కానీ చంద్రముఖి విడుదలయ్యాక చిరు వీఎన్ ఆదిత్యకు ఫోన్ చేసి ఆయన జడ్జిమెంట్ ను ను అభినందించాడు. అలా చిరు రిజెక్ట్ చేసిన కథతో రజినీ రికార్డులు క్రియేట్ చేశాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…