రుచికి తియ్యగా, కాస్త పుల్లగా ఉండే కిస్మిస్ (ఎండు ద్రాక్ష)ల వాడకం ఆరోగ్యానికి ఎంతో మంచిది. సాధారణంగా పాయసంలో జీడిపప్పు, బాదంపప్పులతోపాటు కిస్మిస్‌లను కూడా వేస్తారు. వీటిని చూడగానే పాయసం తాగాలనిపిస్తుంది. కిస్మిస్‌లు వేయడం వల్ల పాయసానికి మంచి రుచి కూడా వస్తుంది. లడ్డూలలో తప్పకుండా కిస్మిస్‌లు వేస్తారు. అయితే ఇవి కేవలం రుచినే కాదు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. అనేక పోషక పదార్థాలు ఈ చిన్న పండ్లలో దాగి ఉంటాయి. అందువల్ల వీటిని రోజూ తింటే ఎన్నో లాభాలను పొందవచ్చు.
కిస్మిస్‌లలో పొటాషియం, మెగ్నిషియం ఉంటాయి. వీటిని తినడం వల్ల అసిడిటీ రాదు. కిస్మిస్‌లలో కాల్షియం ఉండడం వల్ల దంతాలకు, ఎముకలకు మంచిది. వాటిలో ఉండే బోరాన్ అనే ఖనిజం మూలంగా ఎముకలకు సంబంధించిన ఆస్టియో పోరోసిస్‌ను రాకుండా చూసుకోవచ్చు. కిస్మిస్‌లలో రాగి, ఇనుము, విటమిన్ బి 12 కూడా ఉంటాయి. కాబట్టి అనీమియా ఉన్నవారు వీటిని తింటే రక్తహీనత తగ్గుతుంది. త్వరగా గాయాలు నయం అవుతాయి.
కిస్మిస్‌లలో పాలిఫినాలిక్ ఫైటో పోషకాలుంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. బాక్టీరియా వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ రాకుండా చూస్తాయి. కంటి రోగాల నుంచి రక్షణనిస్తాయి. కిస్మిస్ పండ్లను తినడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఒంట్లో నీరసం తగ్గుతుంది. ఉత్సాహంగా ఉంటారు. కిస్మిస్‌లను తినడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. కనుక రోజూ గుప్పెడు కిస్మిస్ పండ్లను తింటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని…
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్‌కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…