Radhe Shyam : రొమాంటిక్‌గా న‌గుమోము తార‌లే సాంగ్.. కెమిస్ట్రీ బాగుంది..!

December 2, 2021 9:32 PM

Radhe Shyam : సాహో త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు మేక‌ర్స్. రాధేశ్యామ్‌ నుంచి లవ్‌ ఆంథమ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. మొదట హిందీ వెర్షన్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది.

Radhe Shyam nagumomu thaarale song launched

ఆషికీ ఆ గయీ.. అంటూ సాగే ఈ వీడియో సాంగ్‌లో ప్రభాస్‌-పూజాల ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఫిదా చేసేలా ఉంది. మనసుని హత్తుకునేలా సాగిన ఈ ప్రేమగీతాన్ని అర్జీత్‌ సింగ్‌ ఆలపించారు. రాధేశ్యామ్‌ హిందీ వెర్షన్‌కు మిథున్‌ సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ గేయ రచయిత సిరివెన్నెల సీతరామశాస్త్రి మృతి చెందిన కారణంగా నగుమోము పాటను వాయిదా వేయ‌గా తాజాగా విడుద‌ల చేశారు.

తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుద‌లైన ఈ పాట శ్రోత‌ల‌ను ఎంత‌గానో అల‌రిస్తోంది. జస్ట్ మ్యూజిక్‌తో సాగే ఈ సాంగ్ సినిమాపై హైప్‌ని, ఇంట్రెస్ట్ ని పెంచింది. విజువల్స్ మరింత కనువిందుగా ఉన్నాయి. ఇందులో ప్రభాస్‌, పూజాహెగ్డే క్యూట్‌గా, అందంగా కనిపిస్తున్నారు. ప్రభాస్‌ నెవర్‌ బిఫోర్‌ అనేలా ఆయన లుక్‌ ఉండటం విశేషం. లవర్‌ బాయ్‌లా కనిపిస్తూ ఆకట్టుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment