Pushpa Movie : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం పుష్ప. డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం అందరి ప్రశంసలను అందుకుంటోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తోటి పరిశ్రమ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తనయుడు అల్లు అయాన్ చేసిన స్పెషల్ ట్వీట్ ఈ రోజును మరింత స్పెషల్ గా చేసింది.
అయాన్ ఒక చిన్న పెన్సిల్ స్కెచ్ తయారు చేసి ‘పుష్ప విడుదల (17-12-2021)… ఆల్ ది బెస్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్’ అంటూ ‘పుష్ప’రాజ్ ను విష్ చేయడం విశేషం. ఈ స్కెచ్‌ని బన్నీ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “నా చిన్ని బాబూ థాంక్యూ… నా అయాన్ ఐ లవ్ యూ… నువ్వు ఈ కార్డ్‌తో నా ఉదయాన్ని మరింత ప్రత్యేకం చేశావు” అంటూ కొడుకుపై ప్రేమను కురిపిస్తూ పొంగిపోయాడు అల్లు అర్జున్.
అయాన్ టాలెంట్ ను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ ఇతర కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో పుష్ప పాన్ ఇండియా లెవల్‌లో విడుదలైంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…