Allu Arjun : ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప హడావిడి నడుస్తోంది. ఇందులో సమంత స్పెషల్ సాంగ్ చేయగా, ఆ సాంగ్‌పై ఎన్ని విమర్శలు వచ్చాయో మనందరం చూశాం. పురుషులందరినీ చెడ్డగా చూపించేలా ఈ పాట ఉందని, ఈ సాంగ్ బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేసింది పురుషుల సంఘం. తమిళంలోనూ వ్యతిరేకత వస్తోంది. ఈ పాటలోని ‘మీ మగబుద్ధే వంకరబుద్ధి..’ అనే లిరిక్స్ వివాదం రేపుతున్నాయి.
ఈ పాటను తొలగించకుంటే ఈ పాటకు డ్యాన్స్ చేసిన సమంత, పాట పాడిన ఆండ్రియా, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గేయరచయితపై కేసు పెడతామని హెచ్చరించింది. ‘ఓ సొల్‌రియా’ అనే పాట తమిళంలోనూ సూపర్ హిట్ అయింది. కానీ ఈ వివాదం యూనిట్‌కి కాస్త ఆందోళన కలిగించింది. అయితే ఇదే పాటపై ఓ రిపోర్టర్ బన్నీని ప్రశ్నించాడు.
పుష్ప ప్రమోషన్లలో పాల్గొన్న అల్లు అర్జున్ ని.. ‘మీ మగబుద్ధే వంకరబుద్ధి..’ అంటూ పాట లిరిక్స్‌పై వస్తున్న వివాదాలపై మీ స్పందన ఏంటి అని ఓ రిపోర్టర్ బన్నీని ప్రశ్నించగా.. ‘లిరిక్స్‌లో తప్పు లేదు, ఇదే నిజం’ అంటూ షాకింగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే మహిళలు ఈ సాంగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. సమంత, చంద్రబోస్‌పై పాలాభిషేకం కురిపించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…