Pooja Hegde : ఓటీటీలోకి బోల్డ్ మూవీతో వ‌స్తున్న పూజా హెగ్డే.. సౌత్ ప్రేక్ష‌కులు ఖుష్‌

December 25, 2023 5:03 PM

Pooja Hegde : టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఇప్పుడు ఈ అమ్మ‌డికి తెలుగులో అవకాశాలు రాకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈమె నుంచి కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉండగా అభిమానులకు నిరాశే మిగులుతోంది.. గత సంవత్సరం పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాలో నటించిన అది ఫ్లాప్ అయింది. చిరంజీవి ఆచార్య చిత్రం కూడా పూజాకి క‌లిసి రాలేదు. ముఖ్యంగా బాలీవుడ్ మీద మోజుతో అక్కడ అవకాశాల కోసం వెళ్లిన స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చిన ఫ్లాపులు గానే మిగిలాయి.

టాలీవుడ్ లో వచ్చిన అవకాశాలు అన్నిటిని కూడా వదులుకొని ఇప్పుడు సైలెంట్ గా ఉంటోంది పూజా హెగ్డే .గతంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న జనగణమన సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన ఆ సినిమా ఆగిపోయింది. గుంటూరు కారం ఒప్పుకున్నాక తప్పిపోవడం ఫ్యాన్స్ ని ఇప్పటికీ బాధ పెడుతోంది. అది కాస్తా శ్రీలీలని వరించడం ఇంకాస్త పెంచింది. దీని సంగతలా ఉంచితే త్వరలో ఈ డీజే భామ డిజిటల్ డెబ్యూ చేయబోతోందనే టాక్ వినిపిస్తుంది. నెట్ ఫ్లిక్స్ నిర్మించబోయే ఒక భారీ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఓటిటి వర్గాల టాక్. కోలీవుడ్ ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రాజెక్టు కోసం స్క్రిప్ట్ సిద్ధమయ్యిందని వినికిడి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Pooja Hegde latest movie coming directly on ott
Pooja Hegde

విక్రమ్ కోబ్రా, నయనతార ఇమైక్క నొడిగళ్ చిత్రాల‌ని అజ‌య్ జ్ఞాన‌ముత్తు తెర‌కెక్కించాడు. హారర్ జానర్ లో సూపర్ హిట్ మూవీగా నిలిచిన డిమాంటీ కాలనీతో డెబ్యూ చేశాడు. ఇప్పుడు దీని సీక్వెల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. పూజా హెగ్డే చుట్టే కథ రాసుకున్నాడట. ఇప్పటిదాకా గ్లామర్ పాత్రలకే పరిమితమైన పూజాకు ఇలాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కడం మంచిదే. తనలో ఉన్న అసలైన నటిని బయటికి తీసుకొచ్చే అవకాశం వెబ్ వరల్డ్ లోనే ఉంటుంది. బోల్డ్‌గా ఈ అమ్మ‌డు ప్రేక్ష‌కుల‌ని చాలా అల‌రిస్తుంద‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now