Pindam OTT : ఓటీటీలోకి బిగ్గెస్ట్ హార‌ర్ మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ కానుంది అంటే..!

December 31, 2023 10:02 AM

Pindam OTT : కంటెంట్ బాగున్న సినిమాల‌కి ఓటీటీలోను మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భిస్తుంది. ఇక అందులోనూ హార్రర్ సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఇటీవల కాలంలో లో 2023లోనే బిగ్గెస్ట్ హార్రర్ మూవీగా పిండం తెరకెక్కింది. అయితే ఈ సినిమా థియేటర్లలో ఎంత వణికించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హర్రర్ సినిమాల్లో ది బెస్ట్ హర్రర్ సినిమాగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈసినిమాను నెట్‌ఫ్లిక్స్‌.. దక్కించుకుంది. న్యూ ఇయర్ 2024 జనవరి ఫస్ట్ వీక్‌లో.. స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఆ క్రమంలోనే తమ సోషల్ మీడియా హ్యాండిల్లో హింట్స్ ఇస్తోంది నెట్‌ ఫ్లిక్స్‌.

కళాహి మీడియా బ్యానర్‌పై హారర్ బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన ఈ సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. శ్రీరామ్‌, ఖుషి రవి, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. టీజర్‌, ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. డిసెంబర్ 15 న రిలీజ్ అయింది. ఆడియెన్స్‌ను వణింకింది. హిట్ సినిమాగా హిస్టరీ కెక్కింది. నటుడు శ్రీరామ్ చాలా ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా తాజా చిత్రం పిండం. ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. ఓటీటీలో కూడా ఈ మూవీ అద‌ర‌గొడుతుంద‌ని భావిస్తున్నారు.

Pindam OTT know the platform and streaming details
Pindam OTT

చిత్ర క‌థ విష‌యానికి వస్తే…. ఆంథోని(శ్రీరామ్‌) ఓ రైస్‌ మిల్లులో అకౌంటెంట్‌ గా పని చేస్తుండగా…. అతని భార్య మేరి(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు(సోఫియా, తార), తల్లి సూరమ్మతో కలిసి శుక్లాపేటలోని ఓ ఇంట్లో నివసిస్తూ ఉంటాడు. అయితే అది ఓ పురాతమైన ఇల్లు… తక్కువ ధరకు వస్తుందని భావించి ఆ ఇంటిని కొనుగోలు చేస్తాడు హీరో. అయితే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత వారికి ఊహించని సంఘటనలు ఎదురు కాగా… వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనే కథంశంతో తెరకెక్కించారు. మీరు ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయితే కనుక ఓటీటీలో చూసేయండి. కానీ గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఈ సినిమాను చూడొద్దని సెన్సార్ బోర్డు ప్రకటించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now