వినోదం

Nagarjuna : నాగార్జుననే అస‌లు బాధ్యుడు.. ఆయ‌న‌ని అరెస్ట్ చేయాలంటూ న్యాయ‌వాది పిటీష‌న్..!

Nagarjuna : బిగ్ బాస్ సీజ‌న్ 7 కార్య‌క్ర‌మం ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తూ స‌జావుగానే సాగింది. కాని ఫినాలే రోజు అన్న‌పూర్ణ స్డూడియో గేటు ద‌గ్గ‌ర భీబ‌త్సం జ‌రిగింది. బిగ్ బాస్ ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన దాడులు, అల్లర్లకు పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సహా మరో మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అతడిని అరెస్ట్ చేసి తాజాగా చంచల్‌గూడ జైలుకి త‌ర‌లించి 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే అత‌ను పారిపోయాడంటూ ప్ర‌చారాలు సాగ‌గా, ప్రశాంత్ తాను ఎక్క‌డికి పోలేద‌ని స్వ‌యంగా వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. అయితే నిన్న రాత్రి పోలీసులు అత‌డిని అరెస్ట్ చేసి జైలుకి త‌ర‌లించారు.

బిగ్ బాస్ షో ఫినాలే ఎపిసోడ్ త‌ర్వాత ఈ షోపై చాలా మంది దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదో చెత్త షో.. ఈ షో ప్రసారం చేసి యువత భవిష్యత్ నాశనం చేస్తున్నారు. ఈ బిగ్ బాస్ షో వల్ల సమాజానికి ఏం ఉపయోగం? పిచ్చి చేష్టలతో యువతను పెడదారి పట్టించడం తప్ప అని మండిప‌డుతున్నారు. తాజాగా ఈ షోపై హైకోర్టు న్యాయవాది అరుణ్ రంగంలోకి దిగారు. బిగ్ బాస్ షో పై సమగ్ర దర్యాప్తు చేయాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజల పై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయి. కానీ, ఎక్కడ నాగార్జున పేరు లేదు. ఈ కేసులలో నాగార్జున పేరు కూడా చేర్చాలిని, ఆయ‌న ఈ గొడ‌వ‌ల‌కి సూత్ర‌ధారి అని అరుణ్ చెప్పారు.

Nagarjuna

బిగ్ బాస్ ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో మొదటి నుంచి వాళ్ల ఫ్యామిలీకి హైకోర్ట్ న్యాయవాది అరుణ్ అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే రైతు బిడ్డను అరెస్ట్ చేసిన తర్వాత సదరు లాయర్ తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు బిగ్ బాస్ నిర్వహకులపైన కూడా ఫిర్యాదు చేశారు. అంత గొడవ జరుగుతుంటే బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు. అందుకే 6 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టులో పిటిషన్ వేశాను. నాగార్జునను కూడా అరెస్ట్ వారెంట్ మంజూరు చేసి వెంటనే అందులోకి తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM